తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కులం- మతం లేని సర్టిఫికెట్​ కోసం హైకోర్టుకు బ్రాహ్మణ యువతి

No Caste no religion Certificate: ధ్రువీకరణ పత్రంలో కులం, మతం పేరు లేకుండానే సర్టిఫికెట్​ జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఓ బ్రహ్మణ యువతి గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించారు. తాను భవిష్యత్తులో కులం, మతం చెప్పకూడదని నిశ్చయించుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో మద్రాస్​ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు.

No Caste no religion Certificate
మతం లేని సర్టిఫికెట్​ కోసం హైకోర్టుకు బ్రాహ్మణ యువతి

By

Published : Apr 2, 2022, 7:29 PM IST

No Caste no religion Certificate: గుజరాత్​ హైకోర్టులో అరుదైన, ఆసక్తికరమైన పిటిషన్​ దాఖలైంది. సూరత్​కు చెందిన ఓ బ్రాహ్మణ యువతి.. తనకు ఏ మతం, కులం లేదని రాసి ఉన్న ధ్రువపత్రం జారీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సూరత్​కు చెందిన కాజల్​ మంజుల.. తన కుల ధ్రువీకరణ పత్రం నుంచి కులం, మతం తొలగించాలని పిటిషన్​లో కోరారు. కులం, మతం లేకుండానే తనకు ధ్రువపత్రం జారీ చేయాలని విన్నవించారు.

కులం, మతం విషయంపై హైకోర్టును ఆశ్రయించటం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. భవిష్యత్తులో తాను ఎక్కడా కులం, మతం చెప్పుకోకూడదని నిర్ణయించకున్నట్లు తెలిపారు కాజల్​. మన దేశంలో కులం, మతం పేరుతో వివక్ష రాజ్యమేలుతున్న కారణంగా పిటిషనర్​ చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆమె తరఫు న్యాయవాది ధర్మేశ్​ గుర్జార్​ తెలిపారు. ఆమె రాజ్​గర్​ బ్రాహ్మణ సమాజానికి చెందినవారని, ఈ వివక్షపూరితమైన సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. మద్రాస్​ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ఆధారంగా గుజరాత్​ హైకోర్టును పిటిషనర్​ ఆశ్రయించినట్లు చెప్పారు న్యాయవాది. కులం మతం లేకుండానే స్నేహా ప్రతిభరాజ్​ అనే యువతికి సర్టిఫికెట్​ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్​ హైకోర్టు ఆదేశించినట్లు గుర్తు చేశారు.

కారణం ఇది:2017లో కాజల్​ కుటుంబం మతం మారేందుకు ప్రయత్నించగా జిల్లా కలెక్టర్​ నిరాకరించారు. చట్టం పరిధికి లోబడి ఒక మతం నుంచి మరో మతంలోకి మార్చొచ్చని, కానీ లౌకిక లేదా నాస్తికుడిగా మారేందుకు ఎటువంటి నిబంధన లేదని చెప్పారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. త్వరలోనే ఈ పిటిషన్​పై కోర్టు విచారణ చేపడుతుందని తెలిపారు న్యాయవాది.

ఇదీ చూడండి:సూపర్ బ్రదర్స్.. నడవలేని చెల్లిని డోలీలో మోస్తూ పరీక్షా కేంద్రానికి...

ABOUT THE AUTHOR

...view details