దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన సీ.1.2 రకం కరోనా(c.1.2 variant)పై ప్రభుత్వ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి. దేశంలో ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పాయి. ఈ వేరియంట్ వ్యాప్తి గురించి భయాందోళనలు వీడి, కరోనా నిబంధనలను ప్రజలంతా తప్పక పాటించాలని సూచించాయి.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సీ.1.2 రకం కరోనా వేరియంట్(south africa covid variant) మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. సీ.1.2 రకం కరోనా(c.1.2 variant).. వ్యాక్సిన్ నుంచి లభించిన రక్షణను ఎదిరించి మరీ వ్యాపిస్తున్నట్లు వెల్లడైంది. దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐసీడీ), క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్‌ఫాం(క్రిస్ప్) సంస్థల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.
అధిక మ్యుటేషన్..