NLC Graduate Trainee Posts 2023 : నవరత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC) 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (GET) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
ఉద్యోగాల వివరాలు
- మెకానికల్ ఇంజినీర్ - 120 పోస్టులు
- ఎలక్ట్రికల్ ఇంజినీర్ - 109 పోస్టులు
- సివిల్ ఇంజినీర్ - 28 పోస్టులు
- మైనింగ్ ఇంజినీర్ - 17 పోస్టులు
- కంప్యూటర్ ఇంజినీర్ - 21 పోస్టులు
- మొత్తం పోస్టులు - 295
విద్యార్హతలు
NLC Graduate Executive Trainee Qualifications :
- మెకానికల్ :అభ్యర్థులు మెకానికల్ ఇంజినీరింగ్/ మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
- సివిల్ : అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్/ సివిల్ & స్ట్రక్చురల్ ఇంజినీరింగ్ క్వాలిఫై అయ్యుండాలి.
- కంప్యూటర్ :కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఉండాలి.
- మైనింగ్ : మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
- ఎలక్ట్రికల్ : అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ క్వాలిఫై అయ్యుండాలి.
వయోపరిమితి
NLC Graduate Executive Trainee Age Limit :ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్ 1 నాటికి గరిష్ఠంగా ఎంత ఉండాలంటే..
- యూఆర్/ ఈడబ్ల్యూఎస్ - 30 ఏళ్లు
- ఓబీసీ - 33 ఏళ్లు
- ఎస్సీ - 35 ఏళ్లు
- ఎస్టీ - 35 ఏళ్లు
దరఖాస్తు రుసుము
NLC Graduate Executive Trainee Application Fee :
- యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.854 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ దరఖాస్తు రుసుముగా రూ.345 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
NLC Graduate Executive Trainee Selection Process :గేట్-2023 స్కోర్ (80 మార్కులు), పర్సనల్ ఇంటర్వ్యూ (20 మార్కులు) ఆధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.