NLC Apprentice Jobs 2024 : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLC) 632 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత అప్లికేషన్‌తోపాటు అవసరమైన పత్రాలన్నింటినీ కలిపి గడువులోగా ఎన్ఎల్సీకి పంపించాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల వివరాలు
- మెకానికల్ ఇంజినీరింగ్ - 75 పోస్టులు
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 78 పోస్టులు
- సివిల్ ఇంజినీరింగ్ - 27 పోస్టులు
- ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ - 15 పోస్టులు
- కెమికల్ ఇంజినీరింగ్ - 9 పోస్టులు
- మైనింగ్ ఇంజినీరింగ్ - 44 పోస్టులు
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 47 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ ఇంజినీరింగ్ - 5 పోస్టులు
- ఫార్మసీ - 14 పోస్టులు
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుల వివరాలు
- మెకానికల్ ఇంజినీరింగ్ - 95 పోస్టులు
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 94 పోస్టులు
- సివిల్ ఇంజినీరింగ్ - 49 పోస్టులు
- ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ - 9 పోస్టులు
- మైనింగ్ ఇంజినీరింగ్ - 25 పోస్టులు
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 38 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ ఇంజినీరింగ్ - 8 పోస్టులు
- మొత్తం పోస్టులు - 632
విద్యార్హతలు
NLC Apprentice Qualifications :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఫార్మసీ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు బీ.ఫార్మ్ పాస్ అయ్యుండాలి.
- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
NLC Apprentice Age Limit : వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తు రుసుము
NLC Apprentice Application Fee :అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
NLC Apprentice Selection Process :డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీ.ఫార్మసీల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.