NLC Apprentice Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC) 736 - ట్రేడ్ అప్రెంటీస్, 141 - గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత హార్డ్ కాపీలను నవంబర్ 15లోపు NLC కార్యాలయానికి పంపించాలి.
ఉద్యోగాల వివరాలు
NLC Recruitment 2023 :
- ఫిట్టర్ - 120 పోస్టులు
- టర్నర్ - 45 పోస్టులు
- మెకానిక్ - 120 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ - 123 పోస్టులు
- వైర్‌మ్యాన్ - 110 పోస్టులు
- మెకానిక్ (డీజిల్) - 20 పోస్టులు
- మెకానిక్ (ట్రాక్టర్) - 10 పోస్టులు
- కార్పెంటర్ - 10 పోస్టులు
- ప్లంబర్ - 10 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ - 20 పోస్టులు
- వెల్డర్ - 108 పోస్టులు
- PASAA - 40 పోస్టులు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 141 పోస్టులు
విద్యార్హతలు
NLC Apprentice Job Qualifications :
- ట్రేడ్ అప్రెంటీస్ - అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి ఐటీఐ (NCVT/ SCVT) పూర్తి చేసి ఉండాలి.
- PASAA - అభ్యర్థులు PASAA ట్రేడ్ విత్ COPA (NTPC/ PNTC) క్వాలిఫై అయ్యుండాలి.
- నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - అభ్యర్థులు బీకాం/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)/ బీఎస్సీ (జియోలజీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
NLC Apprentice Age Limit :
- ట్రేడ్ అభ్యర్థుల వయస్సు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- గ్రాడ్యుయేట్ అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
NLC Apprentice Application Fee :అభ్యర్థులు ఎవ్వరూ ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
NLC Apprentice Selection Process :ముందుగా అడమిక్ మార్క్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
NLC Apprentice Salary :
- ట్రేడ్ అప్రెంటీస్లకు నెలకు రూ.10,019 స్టైపెండ్ ఇస్తారు.
- PASAA అప్రెంటీస్లకు నెలకు రూ.8,766 స్టైపెండ్ అందిస్తారు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్లకు నెలకు రూ.12,524 స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం
NLC Apprentice Application Process :
- అభ్యర్థులు ముందుగా ఎన్ఎల్సీ అధికారిక వెబ్సైట్ https://www.nlcindia.in/ ను ఓపెన్ చేయాలి.
- NLC Recruitment 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- తరువాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. తరువాత ఈ అప్లికేషన్ హార్డ్ కాపీతో పాటు కింద తెలిపిన పత్రాలను కూడా NLC కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన పత్రాలు
1. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్స్