Nizamabad Family Murder Case Update : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఆరుగురి హత్యకేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసును సాంకేతికత(Technology) సాయంతో ఛేదించినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. ఆస్తి కోసం పథకం ప్రకారమే నిందితులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశారన్నారు. కిరాతకుడి బారి నుంచి ప్రసాద్ తల్లి సుశీలను రక్షించామని చెప్పారు. నలుగురి మృతదేహాలు లభించాయని, ప్రసాద్, అతడి భార్య మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - తెలంగాణ అయ్యప్ప భక్తులు దుర్మరణం
Six Members Murder in Nizamabad : గత నెల 19న ప్రసాద్‌ను మాక్లూర్ మండలం మదనపల్లి(madanapalle) వద్ద అటవీ ప్రాంతంలో రాళ్లు, కర్రలతో కొట్టి చంపి, పూడ్చి పెట్టినట్లు ప్రశాంత్ ఒప్పుకున్నాడని ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. ఈ కేసులో ప్రశాంత్‌తో పాటు వంశీ, విష్ణు సహా ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రసాద్‌ను చంపేశాక మిగతా కుటుంబ సభ్యుల్ని నమ్మించి వేర్వేరుగా, వేర్వేరు ప్రాంతాల్లో చంపేశాడని తెలిపారు. ప్రసాద్ భార్య, చెల్లెలు, పిల్లల్ని గొంతు నులిమి చంపి, ఆ తర్వాత శవాలను పడేశారని వివరించారు.
''నిందితుడు ప్రశాంత్ డిసెంబర్ 1న ప్రసాద్ భార్య శాన్విక, చెల్లెలు శ్రావణినినిజామాబాద్తీసుకెళ్లాడు. శాన్వికను భర్త ప్రసాద్ దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి బాసర తీసుకెళ్లాడు. అక్కడే బాసర(Basara) వంతెన వద్ద తాడుతో ఆమె గొంతును బిగించి చంపాడు. వెంటనే నిందితుడు మృతదేహాన్ని గోదావరిలో పడేశాడు. ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి శ్రావణిని సైతం తీసుకెళ్లిమెదక్ జిల్లాచేగుంట మండలం వడియారం వద్ద చంపి తగులబెట్టారు"- సింధూ శర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీ