తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెనుతుపానుగా నివర్​- ఈదురుగాలుల బీభత్సం

నివర్​ తీవ్ర తుపానుగా కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తమిళనాడు మామల్లపురంలో భీకరగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మామల్లపురం-కరైకల్​ వద్ద ఈరోజు అర్ధరాత్రి తర్వాత నివర్​ తుపాను తీరం దాటనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

nivar toofan latest updates
తీవ్ర తుపానుగా కొనసాగుతున్న 'నివర్'

By

Published : Nov 25, 2020, 5:28 PM IST

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా నివర్​ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు మామల్లపురంలో భీకరగాలులు వీస్తున్నట్లు తెలిపింది. కడలూరుకు 180 కి.మీ, పుదుచ్చేరికి 190 కి.మీ. దూరంలో 'నివర్​' కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. గంటకు 11 కి.మీ. వేగంతో తీరం వైపు కదులుతున్నట్లు ఐఎండీ వివరించింది.

3 రాష్ట్రాలకు 25 బృందాలు..

రంగంలోకి ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది
కొనసాగుతున్న సహాయక చర్యలు
జాతీయ విపత్తు బృందం సహాయక చర్యలు
ఈదురు గాలుల బీభత్సం
మామల్లపురంలో భీకర ఈదురు గాలులు
పెను తుపానుగా 'నివర్​'
తమిళనాడుని ముంచెత్తిన వర్షాలు

'నివర్​ తుపాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్​డీఆర్​ఎఫ్​) అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉండనున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్​లకు 25 బృందాలను పంపించినట్లు తెలిపారు ఎన్​డీఆర్​ఎఫ్​ డీజీ ఎస్​ఎన్​ ప్రధాన్​. కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారని.. రెండు రోజులుగా క్షేతస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు.

సురక్షిత ప్రాంతాలకు..

చెన్నైలో భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో చెన్నైలో వర్షాలు

తరలింపు..

'నివర్​' దృష్ట్యా.. ముప్పు ముంగిట ఉన్న తమిళనాడులోని దాదాపు 30 వేల మంది, పుదుచ్చేరిలోని 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాన్​ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు కలిసి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. నష్టాన్ని వీలైనంతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి :మరికొద్దిగంటల్లో పెనుతుపానుగా 'నివర్​'

ABOUT THE AUTHOR

...view details