బిహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం పదవి చేపట్టానికి నితీశ్ కుమార్ సమ్మతించలేదని.. భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఎన్డీఏ తన పేరు మీద ఓట్లు అడిగిందని గుర్తు చేసిన తర్వాతనే ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పదే పదే నితీశ్.. సీఎం పదవి గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కు ఆ పదవిపై పెద్దగా ఆసక్తి లేదని, భాజపా కోరితేనే ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించారని సుశీల్ మోదీ నొక్కి చెప్పారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 74, జేడీ(యూ) 43 స్థానాల్లో గెలుపొందాయి. సీట్లు ఎక్కువ రావడం వల్ల కమలం పార్టీ అభ్యర్థినే సీఎం చేయాలని నితీశ్ చెప్పారు. రాష్ట్ర భాజపా, హెచ్ఏఎం, వీఐపీ పార్టీలన్ని కోరితేనే నితీశ్ ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒప్పుకున్నారు.