తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభపై నితీశ్​ ఆసక్తి.. తదుపరి ఉపరాష్ట్రపతి?

Nitish Kumar Vice President: బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​ త్వరలో ఉపరాష్ట్రపతి కానున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని నితీశ్​ భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లేందుకు నితీశ్​ ఆసక్తిగా ఉన్నారని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

nitish kumar
నితీశ్​ కుమార్

By

Published : Apr 1, 2022, 7:25 AM IST

Updated : Apr 1, 2022, 9:23 AM IST

Nitish Kumar Vice President: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తదుపరి ఉపరాష్ట్రపతి కానున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం కొద్ది నెలల్లో ముగుస్తున్న నేపథ్యంలో.. నితీశ్‌ ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టవచ్చంటూ కొన్ని మీడియాల్లో వార్తలు వస్తుండటం వల్ల ఇది చర్చనీయాంశమైంది. ఇదే జరిగితే బిహార్​ నుంచి నాలుగు సభలకు(బిహార్​ శాసనసభ, బిహార్ శాసనమండలి, లోక్​సభ, రాజ్యసభ)​ ప్రాతినిధ్యం వహించిన నాలుగో రాజకీయ నేతగా నితీశ్​ నిలుస్తారు. అంతకుముందు.. లాలూ ప్రసాద్​ యాదవ్, సుశీల్​ మోదీ, నాగమణి కుశ్వాహా ఈ ఘనత సాధించారు.

ఆయన వెళ్లాల్సిందే:నితీశ్​ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశంపై బిహార్​ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి స్పందించారు. నితీశ్​ రాజ్యసభకు వెళ్లాలని.. అదే అందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల జర్నలిస్టులతో జరిగిన అనధికారిక భేటీలో నితీశ్​ రాజ్యసభ విషయాన్ని ప్రస్తావించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. "రాజ్యసభకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రస్తుతం నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇది గత పదహారేళ్లలో అనేక సార్లు చేపట్టాను." అని నితీశ్​ పేర్కొన్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

అందులో నిజం లేదు: నితీశ్​ కుమార్​ త్వరలో రాజ్యసభకు వెళ్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు బిహార్​ కేబినెట్​ మంత్రి, జేడీయూ నేత సంజయ్​ కుమార్​ ఝా. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని.. పదవీ కాలం ముగిసే వరకు సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. 2020 బిహార్​ ఎన్నికల్లో నితీశ్​ కారణంగానే ఎన్​డీఏ కూటమి విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ప్రజా సేవ, బిహార్​ రాష్ట్ర అభివృద్ధికి నితీశ్​ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారికి కలిగే లాభం ఏమీ ఉండదని తెలిపారు.

ఇదీ చూడండి :వీడ్కోలు వేదికపై పాటలతో అలరించిన రాజ్యసభ ఎంపీలు

Last Updated : Apr 1, 2022, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details