Nitish Kumar on Bihar Special Status : బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో మరో ముందడుగు వేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించిందని వెల్లడించారు ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు నీతీశ్. దీంతో పాటు కులగణనలో నిరుపేదలుగా తేలిన 94 లక్షల కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతుందని గుర్తు చేశారు.
"బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. 94లక్షల నిరుపేద కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి దశలవారీగా రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. గుడిసెల్లో నివసించే 39 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. అందుకోసం రూ.1,20 లక్షలు ఇస్తాం. స్థలం లేని కుటుంబాల కోసం తొలుత రూ.60వేలు ఇవ్వాలని అనుకున్నాం. దానిని ఇప్పుడు లక్ష రూపాయాలకు పెంచాలని నిర్ణయించాం. దీని వల్ల 63,850 మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకాల అమలుకు సుమారు రూ.2.50 లక్షల కోట్లు అవుతుందని అంచనా. వీటిని ఐదేళ్ల లోపు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
కానీ, ప్రత్యేక హోదా ఇస్తే.. వీటిని పూర్తి చేయడానికి తక్కువ సమయం పడుతుంది. మా డిమాండ్‌ను పరిశీలించేందుకు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. 2017లో ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఏం ప్రయోజనం లేదు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి కోరుతున్నాం. బిహార్ ప్రజల అవసరాల దృష్ట్యా మా డిమాండ్‌కు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం