తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం X స్పీకర్​.. అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం.. దద్దరిల్లిన సభ

Nitish Kumar in Assembly: అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఓ విషయంపై స్పీకర్​, ముఖ్యమంత్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. మరోవైపు.. విపక్షాలు నినాదాలతో హోరెత్తించటం వల్ల సభ దద్దరిల్లింది. ఈ సంఘటన బిహార్​ శాసనసభలో సోమవారం జరిగింది.

BIHAR VIDHANSABHA
నితీశ్​ కుమార్​, విజయ్​ సిన్హా

By

Published : Mar 14, 2022, 2:32 PM IST

సభలో మాట్లాడుతున్న సీఎం నితీశ్​ కుమార్​

Nitish Kumar in Assembly: బిహార్​ శాసనసభ బడ్జెట్​ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ విషయంపై స్పీకర్​ విజయ్​ సిన్హా, సీఎం నితీశ్​ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే విపక్షాలతో పాటు అధికార కూటమిలోని భాజపా ఎమ్మెల్యేలు సైతం నిరసనలు చేపట్టటం వల్ల సభ దద్దరిల్లింది.

ఇదీ జరిగింది..

శాసనసభ స్పీకర్​ విజయ్​ సిన్హా ఇటీవల లఖీసరాయ్​ పర్యటనకు వెళ్లిన క్రమంలో ఆయనతో స్థానిక పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్​కు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై సభలో అసహనం వ్యక్తం చేశారు స్పీకర్​. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీనికి విపక్షాలతో పాటు అధికార కూటమిలోని భాజపా సైతం మద్దతు తెలిపింది.

ఈ విషయాన్ని లేవనెత్తటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. శాంతి భద్రతల అంశాన్ని సభలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సభలో ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించటం సరైంది కాదని చెప్పారు​. ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగం ద్వారా నడుస్తుందని గుర్తుచేశారు. ఏ నేరమైనా కోర్టుకు వెళ్తుందని, శాసనసభ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. అనవసరంగా ఈ అంశాన్ని సభలోకి తీసుకురాకూడదని చెప్పారు.

" మా ప్రభుత్వం ఎవరి పట్ల పక్షపాతంగా వ్యవహరించదు. సమాధానం చెబుతున్నప్పుడు సభలో గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు. రాజ్యాంగం ఏం చెబుతుందో తెలుసుకోండి. మీరు అడిగిన వాటికి సమాధానం చెబుతున్నాం. మళ్లీమళ్లీ ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు. ఈ విధంగా సభ జరగటం సరైంది కాదు."

- నితీశ్​ కుమార్​, బిహార్​ ముఖ్యమంత్రి.

అయితే, సభలో లేవనెత్తాల్సిన అంశాలు, సభ ఏవిధంగా నడిపించాలనేది మీరు చెప్పటమేంటని స్పీకర్​ అనగా.. ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది.

ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్​ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల

ABOUT THE AUTHOR

...view details