బిహార్లోని పాత్రికేయులకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ హోదా కల్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రాధాన్య క్రమంలో టీకా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖతో గుర్తింపు పొందిన విలేకరులతో పాటు.. జిల్లా పౌర సంబంధాల అధికారుల గుర్తింపు పొందిన వారికి కూడా కరోనా యోధులుగా పరిగణిస్తామని బిహార్ ప్రభుత్వం తెలిపింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలో ఉన్న పాత్రికేయులకు టీకా అందజేస్తామని పేర్కొంది.