తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అధికారం కోసమే రాజకీయాలా?.. వదిలేయాలని అనిపిస్తోంది' - నితిన్ గడ్కరీ వార్తలు

Nitin Gadkari quitting politics: రాజకీయాలు వీడాలని తనకు తరచూ అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రస్తుతం రాజకీయాలు అధికారం కోసమే అన్నట్టు మారిపోయాయని అన్నారు.

nitin gadkari quitting politics
nitin gadkari quitting politics

By

Published : Jul 25, 2022, 7:34 PM IST

Nitin Gadkari on quitting politics: రాజకీయాలు అంటే ఈ రోజుల్లో అధికారం కోసమే అన్నట్లుగా మారాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఈ రాజకీయాలను వీడాలని తనకు తరచూ అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటికంటే మన జీవితంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయచర్చకు దారితీశాయి. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త గిరీశ్‌ గాంధీని సన్మానించేందుకు గత వారాంతంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి నితిన్‌ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. "రాజకీయాలంటే ఏంటీ? సమాజం, దేశ సంక్షేమం కోసం చేసేవా? లేదా ప్రభుత్వంలో ఉండటం కోసం చేసేవా? గతంలో సామాజిక ఉద్యమంలో భాగంగా రాజకీయాలు ఉండేవి. సమాజంలో మార్పు కోసం ఆ తర్వాత దేశం, అభివృద్ధిపై దృష్టిపెడుతూ ఇవి సాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు రాజకీయాల్లో మనం ఏం చూస్తున్నాం? అధికారంలోకి రావడమే లక్యంగా రాజకీయాలు సాగుతున్నాయి. సామాజిక, ఆర్థిక సంస్కరణలకు రాజకీయాలు నిజమైన సాధనం. అందుకే రాజకీయ నాయకులంతా సమాజ వృద్ధి, విద్యాభివృద్ధి కోసం పనిచేయాలి" అని గడ్కరీ చెప్పుకొచ్చారు.

అనంతరం గిరీశ్‌ గాంధీ గురించి మాట్లాడుతూ.. "గిరీశ్‌ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన బయటకు వెళ్లిపోవాలని నేను పదేపదే చెప్పేవాడ్ని. నాకు కూడా చాలాసార్లు ఈ రాజకీయాలను వదిలి వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే, మన జీవితంలో రాజకీయాల కంటే కూడా సమాజం కోసం చేయాల్సిన పనులు ఇంకెన్నో ఉన్నాయి" అని అన్నారు. గడ్కరీ వ్యాఖ్యలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన గిరీశ్ గాంధీ.. గతంలో ఎన్సీపీలో చేరి మహారాష్ట్ర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే 2014లో ఆయన ఎన్సీపీ పార్టీకి రాజీనామా చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details