NITI Aayog Vice Chairman: నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవికి రాజీవ్‌కుమార్ రాజీనామా చేశారు. రాజీవ్‌కుమార్ రాజీనామాను కేంద్ర నియామకాల కేబినెట్ ఉపసంఘం ఆమోదించింది. ఆయన స్థానంలో సుమన్ బెరీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్‌కుమార్ ఈనెల 30 వరకు పదవిలో కొనసాగనున్నారని ఆ తర్వాత కొత్త ఉపాధ్యక్షుడిగా సుమన్ బెరీ మే 1 నుంచి బాధ్యతలు తీసుకుంటారని పేర్కొంది.
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా తప్పుకున్న రాజీవ్ కుమార్ - రాజీవ్ కుమార్
NITI Aayog Vice Chairman: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు రాజీవ్‌కుమార్. ఈ నేపథ్యంలో కొత్త వైస్‌ఛైర్మన్‌ను ప్రకటించింది కేంద్రం. సుమన్ బేరీకి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 30 వరకు రాజీవ్ తన పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది.
2017 ఆగష్టులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. నూతన ఉపాధ్యక్షుడిగా నియమితులైన సుమన్ బెరీ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానామిక్ రిసెర్చ్‌లో 2001 నుంచి 2011 వరకు 10 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. దిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్‌లో విజిటింగ్ ఫెల్లోగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించి సాంకేతిక సలహా కమిటీలోనూ సభ్యుడిగా పనిచేశారు.
ఇదీ చూడండి :నాలుగేళ్ల చిన్నారిని ఇటుకతో కొట్టి చంపిన 11 ఏళ్ల బాలుడు!