తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సలైట్ రాజ్యంలో విద్యా కుసుమాలు.. యువత భవితకు దిక్సూచిగా నీతి ఆయోగ్! - సంయుక్తంగా పనిచేస్తున్న బైజూస్ నీతి ఆయోగ్

ఆర్థికంగా వెనకబడినవారికి అండగా నిలుస్తోంది బైజూస్​. నీతి ఆయోగ్​తో కలిసి బైజూస్.. ఝార్ఖండ్​లోని పలామూ జిల్లాలో పనిచేస్తోంది. మావోయిస్టుల రక్తపాతంతో తడిసిన నేల ప్రస్తుతం విద్యా గుబాళింపులతో తళుకులీనుతోంది. అక్కడి విద్యార్థులను ఇంజినీరింగ్, మెడిసిన్​లో సీట్లు సాధించేందుకు శిక్షణ ఇస్తోంది బైజూస్.

niti aayog partnership with byjus
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇస్తున్న అధికారులు

By

Published : Nov 13, 2022, 10:21 AM IST

Updated : Nov 13, 2022, 12:34 PM IST

నక్సలైట్ రాజ్యంలో విద్యా కుసుమాలు.. యువత భవితకు దిక్సూచిగా నీతి ఆయోగ్!

ఝార్ఖండ్​లోని పలామూ జిల్లా అంటే ఒకప్పుడు మావోయిస్టుల హింసతో అట్టుడికేది. అయితే ప్రస్తుతం ఆ జిల్లాలో విద్యా కుసుమాలు విరబూస్తున్నాయి. అక్కడి యువత.. చదువులో రాణిస్తూ మెడిసిన్​, ఇంజినీరింగ్ కోర్సులకు ఎంపికవుతున్నారు. వారు ఆ దిశగా అడుగులు వేసేందుకు నీతి ఆయోగ్​, బైజూస్​ సాయపడుతోంది. ఈ రెండు సంస్థలు జతకట్టి విద్యార్థులను సరైన దారిలో నడిపిస్తున్నాయి.

శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు

ఝార్ఖండ్‌లో యువతను వైద్యులు, ఇంజినీర్లుగా మార్చడానికి బైజూస్​తో కలిసి నీతి ఆయోగ్​ పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలామూ, రాంచీ, దుమ్కా, సాహిబ్‌గంజ్, చైబాసా, గుమ్లా, సింగ్‌భూమ్ జిల్లాలోని ఆర్థికంగా వెనకబడిన యువతకు అండగా నిలుస్తోంది. ముందుగా యువతకు ప్రవేశపరీక్షలు నిర్వహించి.. అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి మెరుగైన శిక్షణ అందిస్తోంది. స్టడీ మెటీరియల్​ అందివ్వడమే కాకుండా.. విద్యార్థులకు ఆన్​లైన్​లో నీట్​, ఐఐటీ పాఠాలను బోధిస్తోంది బైజూస్.

స్టడీ మెటీరియల్ అందిస్తున్న బైజూస్ ప్రతినిధులు

ఇప్పటివరకు పలామూలో 14 మంది బాలికలు సహా 40 మందిని విద్యార్థులను ఎంపిక చేసింది బైజూస్. వారిలో 22 మంది మెడిసిన్ సీటు సాధించగా.. 18 మంది ఇంజినీరింగ్ సీటు దక్కించుకున్నారు. దీంతో నీతి ఆయోగ్, బైజూస్ చేస్తున్న ప్రయత్నం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఖరగ్​పుర్​, హరిహరగంజ్ జిల్లా విద్యార్థులకు సైతం తమ శిక్షణా కార్యక్రమాలను విస్తరిస్తోంది బైజూస్.

"బైజూస్ శిక్షణ వల్ల నా జీవితం మారింది. అందుకే చాలా సంతోషంగా ఉన్నా. నేను మంచి డాక్టర్​ను కావాలనుకుంటున్నా."
-ముస్కాన్ పర్వీన్, విద్యార్థిని

"ప్రభుత్వం ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఆర్థికంగా వెనకబడినవారు ముందుకు సాగేందుకు అవకాశం కలుగుతుంది. యువతకు నీట్ కోచింగ్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి పేదలకు మేలు చేకూరుతుంది."
-అనిల్ కుమార్ చౌదరి, పలామూ జిల్లా విద్యాశాఖ సూపరిడెంట్

నీతి ఆయోగ్​తో ఒప్పందం ప్రకారం.. ​యువతకు స్టడీ మెటీరియల్​, ట్యాబ్​లను అందిస్తోంది బైజూస్. మొదటి దశలో మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం స్టడీ మెటీరియల్​ను అందించింది. క్లాసులకు హాజరుకాని వాళ్లకు రికార్డెడ్​ వీడియోలను కూడా అందిస్తోంది బైజూస్.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇస్తున్న అధికారులు

ఇవీ చదవండి:రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల రిలీజ్.. భావోద్వేగంతో కన్నీళ్లు

'మన రాష్ట్రపతి చూడటానికి ఎలా ఉంటారు?'.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు‌

Last Updated : Nov 13, 2022, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details