మధురై పీఠాధిపతిని తానేనని పరారీలో ఉన్న మతగురువు, దైవదూతగా చెప్పుకునే నిత్యానంద స్వామి ప్రకటించుకున్నారు. మధురై పీఠానికి కొత్త అధిపతిని నియమించే ప్రక్రియ ఇప్పటికే పూర్తైనట్లు తెలిపారు. 292వ పీఠాధిపతి గతవారం శివైక్యం చెందిన క్రమంలో.. నిత్యానంద మళ్లీ తెరపైకి వచ్చారు.
మధురై పీఠానికి 292వ పీఠాధిపతిగా శ్రీ అరుణగిరినాథర్(77) గత శుక్రవారం నగరంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శివైక్యం చెందారు. గిరినాథర్ అనంతరం పీఠానికి తానే అధిపతినని గత కొన్నేళ్లుగా నిత్యానంద చెప్పుకుంటున్నారు.