తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిత్యానంద' కైలాసానికి నో ఎంట్రీ! - కైలాసకు నో ఎంట్రీ

పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వివాదాస్పద మతగురువు నిత్యానంద స్వామి ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. తన అధీనంలోని 'కైలాస' ద్వీపానికి ప్రవేశించేందుకు భారతీయులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆదేశాలిచ్చారు.

nithyananda image
నిత్యానంద స్వామి, కైలాస

By

Published : Apr 23, 2021, 7:06 AM IST

కరోనా వేళ.. వివాదాస్పద మతగురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన ఆశ్చర్యపరుస్తోంది. తన అధీనంలోని 'కైలాస' ద్వీపానికి భారతీయులకు అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలివ్వడమే అందుకు కారణం. భారత్‌, బ్రెజిల్, ఐరోపా సంఘం, మలేసియా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు తన ప్రెసిడెన్షియల్ మ్యాండేట్‌లో ప్రకటించారు. పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో.. తన దేశాన్ని రక్షించుకునేందుకు ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటన చేశారు.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్వామీజీ.. 2019లో భారత్‌ను వదిలిపారిపోయారు. అప్పటినుంచి ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈక్వెడార్ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చింది. కాగా, నిత్యానంద తాను ఉంటున్న ద్వీపాన్ని 'కైలాస' అని చెప్తుండటంతో పాటు, దానికి అధినేతగానూ ప్రకటించుకున్నారు. అంతేకాకుండా కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు.

ఇదీ చదవండి:నీట మునిగి ఆరుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details