దక్షిణ అమెరికా ఈక్వెడార్ సమీపంలో తాను కొనుగోలు చేసిన 'కైలాస' దీవికి సందర్శకులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు వివాదాస్పద గురువు నిత్యానంద. కైలాస వెళ్లాలనుకునేవారికి మూడు రోజుల పాటు ఉచిత వీసాతో పాటు.. భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారాయన.
నిత్యానంద దీవికి వెళ్లే వారికి అన్నీ 'ఫ్రీ'! - Kailaasa Islands
వివాదాస్పద గురువు నిత్యానంద.. తాను కొనుగోలు చేసిన 'కైలాస' దీవికి ఉచిత వీసా సౌకర్యం కల్పించారు. అయితే.. కైలాసానికి వెళ్లదలచిన వారికి ఆస్ట్రేలియా నుంచి మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
![నిత్యానంద దీవికి వెళ్లే వారికి అన్నీ 'ఫ్రీ'! Nithyananda annaounces free visa, food and accomodation in Kailasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9909814-957-9909814-1608199587680.jpg)
'కైలాసం' వెళ్లదలచిన వారు గురువారం నుంచి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు నిత్యానంద. ఇందుకోసం contact@kailasa.orgకు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. అయితే.. ఈ ఉచిత సౌకర్యం ఆస్ట్రేలియా నుంచి వెళ్లే భక్తులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంటే కైలాసకు వెళ్లదలచినవారు సొంత ఖర్చులతో తొలుత ఆస్ట్రేలియాకు చేరుకోవాల్సి ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి ఓ ప్రైవేటు విమానం(గరుడ) ద్వారా కైలాసకు వెళ్లవచ్చు. అక్కడ వారికి మూడురోజుల పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను అందిస్తారు.
ఇదీ చదవండి:'అప్పటివరకు సాగు చట్టాలు నిలిపివేయగలరా?'