తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NITలో ప్రొఫెసర్​ పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​.. అప్లైకు చివరి తేది ఎప్పుడంటే? - ప్రభుత్వ ఉద్యోగాలు 2023

NIT Recruitment : నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ సిల్చార్​లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల అయ్యింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు వివరాలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

NIT Recruitment 2023
NIT Silchar faculty Recruitment 2023

By

Published : Jun 21, 2023, 10:28 AM IST

NIT Recruitment : ఇంజినీరింగ్​ అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. అసోంలోని నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ సిల్చార్​ (నిట్స్​​)లో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. తరువాత హార్డ్​కాపీలను నిట్​ సిల్చార్​కు పంపించాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఖాళీల వివరాలు

  • ప్రొఫెసర్​ (లెవల్​ - 14ఏ)
  • అసోసియేట్ ప్రొఫెసర్​ (లెవల్ -​ 13ఏ2)
  • అసిస్టెంట్​ ప్రొఫెసర్​ (గ్రేడ్​ 1) (లెవల్​ - 12)
  • అసిస్టెంట్​ ప్రొఫెసర్​ (గ్రేడ్​ 2) (లెవల్​ - 11)
  • అసిస్టెంట్​ ప్రొఫెసర్​ (గ్రేడ్​ 2) (లెవల్​ - 10)

ఈ నోటిఫికేషన్​ ద్వారా నిట్​ సిల్చార్​లో మొత్తం 68 ఇంజినీర్​ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

డిపార్ట్​మెంట్స్ -అభ్యర్థులు ఆయా ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్స్​లో పనిచేయాల్సి ఉంటుంది.

  1. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సివిల్​ ఇంజినీరింగ్​
  2. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​
  3. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ కంప్యూటర్​ సైన్స్​ & ఇంజినీరింగ్​
  4. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్​ & కమ్యునికేషన్​ ఇంజినీరింగ్​
  5. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్​ & ఇన్​స్ట్రుమెంటేషన్​ ఇంజినీరింగ్​
  6. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ మెకానికల్ ఇంజినీరింగ్​
  7. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ మ్యాథమెటిక్స్​
  8. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఫిజిక్స్​
  9. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ కెమిస్ట్రీ
  10. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ స్టడీస్​
  11. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హ్యూమానిటీస్​ & సోషల్​ సైన్సెస్​

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు

  • జనరల్​ కేటగిరీ - 21 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 06 పోస్టులు
  • ఓబీసీ - 22 పోస్టులు
  • ఎస్సీ - 11 పోస్టులు
  • ఎస్టీ - 08 పోస్టులు

విద్యార్హతలు ఏమిటి?
ఆయా పోస్టులకు సంబంధించి ఇంజినీరింగ్ విద్యార్హతలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

అభ్యర్థుల వయోపరిమితి - సడలింపు వివరాలు
ఆయా పోస్టులను అనుసరించి వయోపరిమితి ఉంటుంది. అలాగే అభ్యర్థుల కేటగిరీ ప్రకారం రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ​పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను చూడండి.

దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి?
ఆసక్తి గల అభ్యర్థులు రూ.1,100 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు కచ్చితంగా ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఎలా చేయాలంటే..

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్​సైట్​ nits.ac.inను ఓపెన్​ చేయాలి.
  • హోమ్​పేజ్​లో ఫ్యాకల్టీ రిక్రూట్​మెంట్​ 2023పై క్లిక్​ చేయాలి.
  • తరువాత దరఖాస్తు ఫారమ్​ను పూరించాల్సి ఉంటుంది.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • అభ్యర్థులు విద్యార్హత పత్రాలతోపాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్​ను అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తును సబ్​మిట్​ చేసిన తరువాత, దాని హార్డ్​ కాపీని ప్రింట్​అవుట్​ తీసుకోవాలి.

నోట్​ : అభ్యర్థులు అప్లికేషన్​ హార్డ్​ కాపీని డీన్​ (ఎఫ్​డబ్ల్యూ), నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ సిల్చార్​, పీ.ఓ.కు జులై 7వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details