తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ పాలనలో అంధకారం.. ఇప్పుడు అమృతకాలం' - ఆర్థిక మంత్రి

Nirmala Sitharaman News: అవినీతి, ద్రవ్యోల్బణం కాంగ్రెస్​ హయాంలో రాజ్యమేలాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2020-21 సంవత్సరంలో దేశంలో 1 బిలియన్ డాలర్​ విలువ చేరుకున్న 42 స్టార్టప్​లను గుర్తించామని వెల్లడించారు. దేశంలో అమృతకాలానికి ఇదే నిదర్శనమన్నారు.

nirmala sitaraman
నిర్మలా సీతారామన్

By

Published : Feb 11, 2022, 9:41 AM IST

Nirmala Sitharaman News: కాంగ్రెస్ పాలనలో దేశం అంధకారంలో ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అవినీతి, రెండు అంకెల ద్రవ్యోల్బణం సహా ఆర్థిక వ్యవస్థను దిగజార్చే అన్ని అంశాలు కాంగ్రెస్​ హయాంలో రాజ్యమేలాయన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేసిన నేపథ్యంలో గురువారం జరిగిన లోకసభ సమావేశంలో నిర్మలా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది అమృతకాలం..

భాజపా అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందన్నారు ఆర్థిక మంత్రి. ప్రస్తుతం దేశం ఆర్థికంగా పుంజుకుంటోందన్నారు. 2020-21 సంవత్సరంలో దేశంలో 1 బిలియన్ డాలర్​ విలువ చేరుకున్న 42 స్టార్టప్​లను గుర్తించామని వెల్లడించారు. దేశంలో అమృతకాలానికి ఇదే నిదర్శనమన్నారు.

2020-2021 మధ్య 44.58 జనధన్​ ఖాతాల్లో రూ.1.57 లక్షల కోట్లు డిపాజిట్​ అయినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎంఎస్​ఎమ్​ఈలకు రూ.2.36 లక్షల కోట్లను సాయం అందించినట్లు తెలిపారు. పీఎం ముద్ర యోజన పథకం కింద ఇప్పటివరకు 1.2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. నిరుద్యోగం కూడా బాగా తగ్గిందని.. మహమ్మారికి ముందున్న స్థాయికి చేరిందని తెలిపారు.

ఇదీ చూడండి :వడ్డీ రేట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన- వరుసగా పదోసారీ..

ABOUT THE AUTHOR

...view details