మూడో తరగతి చదువుతోన్న ఓ చిన్నారి ఆల్ ఇండియా పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. అది ఎందులో అనుకుంటున్నారా? తనకున్న ప్రత్యేక అభిరుచితో.. అగ్గిపెట్టెలను సేకరించి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఆమే.. ఒడిశాకు చెందిన దివ్యాన్సీ బెహెరా. తన తోటి విద్యార్థులంతా డాన్స్, పెయింటింగ్, సంగీతం, స్టాంపులు, నాణేల సేకరణ వంటి సాంప్రదాయ అభిరుచుల్ని ఎంచుకుంటే.. ఆ బాలిక మాత్రం ఖాళీ అగ్గిపెట్టెలను సేకరించాలని సంకల్పించుకుంది.
20 దేశాల నుంచి 5వేల రకాలు..
భువనేశ్వర్‌లోని నాయపల్లిలో నివసించే వసంత బెహెరా కుమార్తె దివ్యాన్సీ బెహెరా.. చిన్నతనం నుంచే అగ్గిపెట్టెలను పోగుచేయడం అలవాటుగా మార్చుకుంది. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, ఇటలీ, థాయ్‌లాండ్ వంటి 20 వేర్వేరు దేశాల నుంచి 5 వేల రకాల అగ్గిపెట్టెలను సేకరించింది. ఆమె సేకరించిన వివిధ రకాల అగ్గిపెట్టెల్లో ఆయా దేశాల్లో స్వాతంత్య్రానికి పూర్వం వాడినవీ ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి:భూలోక స్వర్గాన్నితలపించే అద్దాల మేడ
దివ్యాన్సికి ఆరేళ్ల వయస్సు నుంచే అగ్గిపెట్టలను సేకరించడం అలవాటుగా మారిందంటున్నారు ఆమె తండ్రి వసంత్. ఆమె పోగుచేసిన వాటిలో అతి చిన్నవి మొదలుకొని పెద్ద పరిమాణంలోనూ ఉన్నాయని చెప్పారాయన.
"దివ్యాన్సి సేకరించిన అగ్గిపెట్టెలలో 'ఏ' టూ 'జడ్' ఆల్ఫాబేట్స్ మొదలుకొని రకరకాల జంతువులు, పక్షులు, సినీతారలు, పువ్వులు, పండ్లతో సహా.. భారత్, ఇతర దేశాల్లో ప్రసిద్ధిగాంచిన హోటళ్ల పేరుతో కూడినవి చాలా ఉన్నాయి. ఆరేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది."