తూర్పు లద్ధాఖ్‌లో బలగాల ఉపసంహరణపై.. భారత్, చైనా మధ్య చర్చల్లో ఆశించిన పురోగతి లేదని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్ చెప్పారు. ఇరు దేశాల మధ్య తొమ్మిది దఫాల కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయని.. ఈ చర్చలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని పేర్కొన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన జై శంకర్ ఈ వివరాలు తెలిపారు.
'భారత్-చైనా చర్చల్లో ఆశించిన పురోగతి లేదు'
తూర్పు లద్దాఖ్‌లో నెలొకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత్-చైనాల మధ్య ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది రౌండ్ల చర్చలు జరిగాయని.. రానున్న కాలంలోనూ కొనసాగుతాయని చెప్పారు.
'భారత్, చైనాల చర్చల్లో ఆశించిన పురోగతి లేదు'
ఈ అంశంపై ఇరు దేశాల మధ్య మంత్రుల స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందించిన జై శంకర్.. సైనిక వర్గాలకే దీనిపై అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే విషయాలపై అవగాహన ఉండాలన్న మంత్రి.. ఇది క్లిష్టమైన సమస్య అని తెలిపారు.
ఇదీ చదవండి:'దేశ హితం కోసం వారు సత్యాగ్రహం చేస్తున్నారు'