కేరళలో ఉద్యోగం ఇస్తానని నమ్మించి కొందరు దుండగులు ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ అమ్మాయిని మరొకరికి అమ్మేశారు. అదృష్టవశాత్తు వారి నుంచి తప్పించున్న ఆ బాలిక ఇంటికి చేరుకుని అసలు విషయాన్ని బయటపెట్టింది. కుటుంబ సభ్యుల సాయంతో తనపై జరిగిన అత్యాచారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు ఓ మహిళతో పాటు తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. మరో 12 మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ 17ఏళ్ల బాలిక ఆగస్టులో త్రిస్సూర్‌లోని తన ఇంటి నుంచి పారిపోయి.. కొచ్చి నగరానికి చేరుకుంది. అయితే అక్కడ తనకి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన ముగ్గురు స్నేహితులను కూడా పిలిచి ఆ అమ్మాయిపై అత్యాచారం చేయించాడు. అక్కడితో ఆగకుండా.. ఆ లాడ్జి యజమాని సహా అక్కడ పనిచేసే ఉద్యోగి కూడా బాలికపై అత్యాచారం చేశారు. ఆ బాలికకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి కొన్ని నెలల పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత నిందితులు పలారివట్టంలో ఓ మహిళకు ఆ బాలికను అప్పగించారు. అనంతరం ఆ మహిళ.. బాలికను వ్యభిచార గృహానికి సంబంధించిన కొందరు వ్యక్తులకు అప్పగించింది. అయితే ఆ బాలిక వారి నుంచి తప్పించుకుని త్రిస్సూర్‌లోని తన ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపి.. వారి సహాయంతో ఎర్నాకులం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక మహిళతో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో 12 మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు.
17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కన్న తండ్రి..
తండ్రీకూతుళ్ల బంధానికి మచ్చతెచ్చే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై తండ్రి, మామ అత్యాచారం పలు సార్లు అత్యాచారం చేయగా.. తాత కూడా వేధింపులకు గురిచేశాడని ఆ మైనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.