దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జిల(High court judges) నియామక ప్రక్రియను వేగవంతం చేసింది సుప్రీం కోర్టు. ఈ సెప్టెంబర్ 30న మొత్తం 16 మంది అడ్వొకేట్లు, జుడీషియల్ అధికారులకు పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు తాజాగా 9 మందిని ఆయా హైకోర్టులకు పంపిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇందులో ఏడుగురు జుడీషియల్ అధికారులు, ఇద్దరు అడ్వొకేట్లు ఉన్నారు. వీరిని 5 హైకోర్టులకు జడ్జిలుగా నియమిస్తున్నట్లు.. సంబంధిత వివరాలను న్యాయ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
నలుగురిని ఝార్ఖండ్ హైకోర్టుకు(High court judges), ఇద్దరిని పట్నా హైకోర్టుకు ఎంపిక చేసింది కేంద్రం. మిగతా ముగ్గురు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ హైకోర్టులకు నియమితులయ్యారు.
జస్టిస్ రమణ వచ్చిన తర్వాత..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ (nv ramana news) ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన నేతృత్వంలోని కొలీజియం.. ఖాళీల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులు సహా దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి వంద మంది పేర్లను సిఫార్సు చేసింది.
ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది జడ్జిలు(Supreme Court Judges) ప్రమాణస్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఇంతమంది జడ్జిలు ఒకేసారి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం విశేషం. జస్టిస్ ఎన్వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు.
2021 మే 1 నాటికి దేశంలోని హైకోర్టులకు 1,080 మంది న్యాయమూర్తులను కేటాయించగా, ప్రస్తుతం అవి 420 మందితో మాత్రమే పని చేస్తున్నాయి.
ఇవీ చూడండి:'న్యాయవ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ అవసరం'
'నేతలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు'