ఝార్ఖండ్ కంగి బ్లాక్‌లోని డుమర్సోటా గ్రామ ప్రజలు బావిలో పడిన ఓ జింకను రక్షించారు. ఆకలి దప్పికలతో ఉన్న ఆ జింక.. ఆహారం కోసమని గ్రామంలోకి వచ్చిందని స్థానికులు తెలిపారు. జింకను రక్షించడానికి అక్కడ ఉన్న వారు అటవీ శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బావిలో పడ్డ నీలగై జింక- తాళ్లతో పైకి లాగిన గ్రామస్థులు - బావిలో పడిన జింకను రక్షించిన స్థానికులు
ఝార్ఖండ్‌లోని ఓ గ్రామంలో బావిలో పడిన జింకను గ్రామస్థులు రక్షించారు. అనంతరం.. అటవీ సిబ్బందికి అప్పగించారు.
జింక, బావిలో పడిన జింక
సిబ్బంది నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ప్రజలే చోరవ తీసుకుని జింకను బావి నుంచి బయటకు లాగారు. ఈ క్రమంలో జింకకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అటవీ సిబ్బందికి అప్పగించారు.
ఇదీ చూడండి:Viral: నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన దుండగులు