తెలంగాణ

telangana

By

Published : Mar 11, 2021, 10:55 PM IST

Updated : Mar 11, 2021, 11:01 PM IST

ETV Bharat / bharat

కొవిడ్ విజృంభణతో అమలులోకి రాత్రి కర్ఫ్యూ!

పంజాబ్​లో కొవిడ్​ ఉద్ధృతి దృష్ట్యా కొన్ని జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు తెలిపారు. లుథియానా, పటియాలా జిల్లాల్లో మార్చి 12 నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని చెప్పారు.

Night curfew to be imposed in Patiala District
కొవిడ్ విజృంభణతో అమలులోకి రాత్రి కర్ఫ్యూ!

పంజాబ్​లో కొవిడ్​ మళ్లీ విజృంభిస్తోంది. ఈ తరుణంలో లుథియానా జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ విధించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మార్చి 12 నుంచి ఇది అమలవుతుందని పేర్కొన్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు పక్కాగా ఈ కర్ఫ్యూ విధిస్తామని తెలిపారు.

పోలీసులు, ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్​ సేవలు అందించే వారికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

పటియాలాలోనూ..

పటియాలా జిల్లాలోనూ రాత్రి కర్ఫ్యూ అమలుచేయనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.

ఒక్కరోజే 1300 కేసులు

పంజాబ్​లో గురువారం 1,309 కొత్త కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసులు సంఖ్య 1,93,345కు చేరింది. 5,996 మంది వైరస్​కు బలయ్యారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్​ కేసుల సంఖ్య 10 వేలు దాటింది.

ఇదీ చదవండి:వైభవంగా 'ఈశా ఫౌండేషన్'​ మహాశివరాత్రి వేడుకలు

Last Updated : Mar 11, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details