Night Curfew in Mumbai: కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ కలకలం నేపథ్యంలో ముంబయిలో రాత్రి వేళల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్‌లు, పార్కులు, ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరిన్ని నిబంధనలు..
- వివాహ కార్యక్రమాల్లో 50 మందికి మించరాదు.
- సామాజిక, మతపరమైన, రాజకీయ సభల్లో కూడా 50 మంది కంటే ఎక్కువ హాజరుకావద్దు.
- అంతిమ సంస్కారాల్లో 20 మందికన్నా ఎక్కువ పాల్గొనకూడదు.
- ఈ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు.
Mumbai Curfew Rules: ముంబయిలో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరిగాయి. దానికి తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. గురువారం 46,337 కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,555 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.