తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Night Curfew: కరోనా విజృంభణ.. ఆ రాష్ట్రంలో మళ్లీ నైట్ కర్ఫ్యూ - మధ్యప్రదేశ్​లో నైట్​ కర్వ్యూ

Night Curfew in Madhya Pradesh: కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. గురువారం నుంచి నైట్​ కర్ఫ్యూ విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్​ ప్రభుత్వం తెలిపింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పింది.

Nihgt curfew in madhya pradesh
మధ్యప్రదేశ్​లో నైట్ కర్ఫ్యూ

By

Published : Dec 23, 2021, 9:20 PM IST

Night Curfew in Madhya Pradesh: మధ్యప్రదేశ్​లో కరోనా కేసులు ముఖ్యంగా ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి రాత్రి కర్ఫ్యూ(నైట్ కర్ఫ్యూ) విధిస్తున్నట్లు తెలిపింది. ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

"కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాం. గురువారం నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇది కొనసాగుతుంది" అని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

Madhya pradesh covid restrictions: రెండు డోసుల కొవిడ్ టీకా తీసున్నవారికి మాత్రమే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది. జిమ్​లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ ఈ నియమం వర్తిస్తుందని వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు.

Centre warns states: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం సూచించింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:'భయమొద్దు.. డెల్టాకంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే.. కానీ...'

ABOUT THE AUTHOR

...view details