కరోనా కట్టడి కోసం విధించిన రాత్రి కర్ఫ్యూను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది(gujarat covid guidelines). సెప్టెంబర్ 25 వరకు 8 నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించింది.(gujarat covid cases)
అహ్మదాబాద్, వడోదరా, రాజ్కోట్, జునాగఢ్, భావ్నగర్, జామ్నగర్, గాంధీనగర్లో ప్రస్తుతం రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంది. మరోవైపు బహిరంగ వేడుకల్లో ప్రజల పరిమితి(400కు మించకుండా), రాత్రిపూట హొటళ్ల సేవలపై ఉన్న ఆంక్షలను కూడా 25వరకు పొడగించింది రాష్ట్ర ప్రభుత్వం.