తమిళ నటుడు 'సూర్య' హీరోగా నటించిన 'సింగం' సినిమాలో కనిపించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్ మాల్విన్.. డ్రగ్స్ కేసులో కర్ణాటక పోలీసులకు చిక్కాడు. బెంగళూరు కాడుగూండనహళ్లి పోలీసులు అతడ్ని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్ సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పలు సినిమాల్లో..
చాక్విమ్ కన్నడ సహా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కనిపించాడు. అన్నబాండ్, పరమాత్మ వంటి 20 కన్నడ సినిమాల్లో, తమిళ్లో సింగం, విశ్వరూపం సినిమాల్లో నటించి మెప్పించాడు.
ముంబయిలో యాక్టింగ్‌లో శిక్షణ
మెడికల్ వీసాపై భారత్‌కు వచ్చిన చాక్విమ్... ముంబయిలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అంతకుముందు.. 2006లో అతడు ఆరు నెలలపాటు నైజీరియా రాజధాని అబుజాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలోనూ శిక్షణ తీసుకున్నాడు.