తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ నుంచి కశ్మీర్​కు సైకిల్​పై సవారీ - సైకిల్​పై పర్యటన

చేతిలో డబ్బుల్లేవు. రయ్యిమని దూసుకెళ్లేందుకు బైకు లేదు. కానీ, దేశాన్ని చుట్టిరావాలన్న కల మాత్రం ఉంది ఆ కుర్రాడికి. అంతే.. ఓ సైకిల్​నే తన ప్రయాణ సాధనంగా ఎంచుకున్నాడు. కేరళ నుంచి కశ్మీర్​కు చేరుకోవాలన్న తన కలను నిజం చేసుకున్నాడు! ప్రయాణించాలన్న కోరికకు డబ్బులు లేకపోవడం అనేది సమస్యే కాదని నిరూపించాడు.

Nidhin of Kerala set out on a trip from Kerala to Kashmir on a bicycle with Rs 170.
కేరళ నుంచి కశ్మీర్​కు సైకిల్​పై సవారీ

By

Published : Mar 21, 2021, 6:28 AM IST

Updated : Mar 21, 2021, 7:35 AM IST

మనుసుంటే మార్గం ఉంటుందని చాటాడు కేరళలోని ఓ 23 ఏళ్ల కుర్రాడు. కేరళ నుంచి కశ్మీర్​ వరకు సైకిల్​పై ప్రయాణించి, దేశం మొత్తం చూడాలన్న తన కలను నిజం చేసుకున్నాడు.

కేరళలోని త్రిస్సూర్​కు చెందిన నిధిన్​.. జనవరి1న తన యాత్రను ప్రారంభించాడు. ఆ సమయంలో అతని వద్ద ఉన్నది రూ.170 మాత్రమే. ఆ కొద్దిపాటి డబ్బులతోనే ప్రయాణం మొదలుపెట్టి అతడు.. 66 రోజులపాటు, 4,300 కి.మీలు ప్రయాణించి, ప్రస్తుతం హిమాచల్​ ప్రదేశ్​లోని మనాలీకి చేరుకున్నాడు. కొన్నిరోజులు అక్కడే ఉండి, అనంతరం అతడు మనాలీ-లేహ్​ మార్గం గుండా.. కశ్మీర్​కు చేరుకుని తన యాత్రను ముగించనున్నాడు.

అలా.. కోరికకు రెక్కలు

నిధిన్​కు దేశమంతా పర్యటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. లాక్​డౌన్​లో ఉద్యోగం పోగొట్టుకున్న అతడికి తన కోరికను నిజం చేసుకునేందుకు అవకాశం చిక్కినట్లైంది. దాంతో.. అతడు వంద రోజుల్లోనే కేరళ నుంచి కశ్మీర్​కు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇందుకోసం ఓ ద్విచక్రవాహన కోసం అతడు అన్వేషించాడు. అయితే.. పెట్రోల్​ ధర భారం భరించలేనని భావించిన అతడు.. తన సోదరుడి సైకిల్​ను ఎంచుకున్నాడు.

డీఎస్​ఎల్​ఆర్​ను అమ్మేసి..

కానీ, ఆ సైకిల్​ను వాడేందుకు నిధిన్​ సోదరుడు అంగీకరించలేదు. దాంతో తన వద్ద ఉన్న డీఎస్​ఎల్​ఆర్​ కెమెరాను అమ్మి, ఆ డబ్బులతో సైకిల్​ను కొనుగోలు చేశాడు. దాంతో పాటు తన ప్రయాణానికి అవసరమైన చిన్నపాటి వస్తువులను తీసుకున్నాడు. తన సైకిల్​కే ఓ గ్యాస్​ స్టవ్​నూ అమర్చుకున్నాడు.

టీ అమ్ముతూ..

రోజూ వంద కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తానని చెబుతాడు నితిన్​. సాయంత్రాల్లో ఏదైనా పెట్రోల్​ బంకుల వద్ద తన సైకిల్​ను ఆపి, అక్కడకు వచ్చే వారికి టీ చేసి అమ్ముతానని చెప్పాడు. తద్వారా వచ్చిన డబ్బులను తన ప్రయాణ ఖర్చులుగా వినియోగించుకుంటానని అన్నాడు. ఇకరాత్రి సమయాల్లో పెట్రోల్​ బంకుల వద్దే చిన్న క్యాంప్​ వేసుకుని పడుకుంటానని తెలిపాడు.

వివిధ ప్రదేశాల్లో తాను కలిసే వ్యక్తులు.. తనకు ఎంతో మద్దతిస్తారని చెప్పాడు నిధిన్​. కొంత మంది తన వద్ద టీ తాగకుండానే.. డబ్బులు ఇచ్చేవారని అన్నాడు. తాను ఫిల్మ్​మేకర్, యాక్టర్​​ అవ్వాలనుకుంటున్నానని.. అందుకే, భారత్​లోని వివిధ ప్రదేశాల్లోని సంస్కృతిని తెలుసుకుంటున్నానని నిధిన్​ చెబుతున్నాడు. ఈ ప్రయాణం ద్వారా తన లాంటి డబ్బుల్లేని వారు కూడా సైకిల్​పై దేశాన్ని చుట్టిరాగలననే సందేశం ఇవ్వాలనుకుంటున్నానని అంటున్నాడు.

ఇదీ చూడండి:మంచి మనసు చాటుకున్న సింధియా

Last Updated : Mar 21, 2021, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details