తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీమా సంస్థలో 274 ఉద్యోగాలు- దరఖాస్తుకు 20 రోజులే ఛాన్స్​! - బీమా సంస్థలో ఉద్యోగాలు

NICL Jobs 2024 : ఎన్​ఐసీఎల్​లో 274 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. మరి వీటికి కావాల్సిన విద్యార్హతలు, దరఖాస్తు రుసుము, ముఖ్యమైన తేదీలు తదితర పూర్తి వివరాలు మీకోసం.

NICL - 274 Administrative Officer Posts Full Details Here
NICL Jobs 2024

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 10:38 AM IST

NICL Jobs 2024 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్​ ఇన్సూరెన్స్ కంపెనీ​ లిమిటెడ్​లో మొత్తం 274 వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

NICL Jobs 2024 Vacancy Details:

  • మొత్తం పోస్టులు- 274
  • డాక్టర్లు(ఎంబీబీఎస్​)- 28
  • లీగల్​- 20
  • ఫినాన్స్​- 30
  • యాక్చుయేరియల్​- 02
  • ఇనఫర్మేషన్​ టెక్నాలజీ- 20
  • ఆటోమొబైల్​ ఇంజినీర్స్​- 20
  • హిందీ(రాజ్యభాషా) ఆఫీసర్స్​- 22
  • జనరలిస్ట్​- 130
  • బ్యాక్​లాగ్​- 02

విద్యార్హతలు

NICL Jobs 2024 Education Qualification :

  • ఎంబీబీఎస్​, ఎండీ, ఎంఎస్​, ఎంఎస్​సీ, పీజీ- మెడికల్​ డిగ్రీ, లా, బీ.కామ్​, ఎం.కామ్​, బీఈ, బీటెక్​, ఎం.టెక్​(పోస్టులను అనుసరించి)
  • హిందీ ఆఫీసర్​ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో హిందీ లేదా ఇంగ్లిష్​ సబ్జెక్ట్​లో సంబంధిత విభాగంలో 60% మార్కులు సాధించి ఉండాలి.

ఏజ్​ లిమిట్​
NICL Jobs 2024 Age Limit :21-30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 1993 డిసెంబర్​ 02 నుంచి 2002 డిసెంబర్​ 01 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు రుసుము

NICL Jobs 2024 Application Fees :

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు- రూ.250
  • ఇతర కేటగిరీల అభ్యర్థులకు- రూ.1000

ఎంపిక ప్రక్రియ

NICL Jobs 2024 Selection Process :

  • ప్రిలిమ్స్​
  • మెయిన్స్​
  • ఇంటర్వ్యూ
  • హిందీ ఆఫీసర్​ పోస్టులకు ఎటువంటి ప్రిలిమ్స్​ పరీక్ష ఉండదు.

పరీక్ష తేదీ
NICL Jobs 2024 Exam Date :పరీక్ష తేదీ సహా ఇతర వివరాల కోసం ఎప్పటికప్పుడు ఎన్​ఐసీఎల్​ అధికారిక వెబ్​సైట్​ nationalinsurance.nic.co.in. లో చూడవచ్చు.

ముఖ్యమైన తేదీలు

NICL Jobs 2024 Important Dates :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 జనవరి 02
  • దరఖాస్తుకు చివరితేదీ : 2024 జనవరి 22

అప్లై చేసుకోండిలా

How To Apply For NICL Jobs 2024 :

  • ముందుగా ఎన్​ఐసీఎల్​ అధికారిక వెబ్​సైట్​ nationalinsurance.nic.co.in.లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఇప్పుడు హోంపేజీపై కనిపించే ఆన్​లైన్​ అప్లికేషన్​ లింప్​పై నొక్కండి.
  • ఫోన్​ నంబర్​ సహా అడిగిన వివరాలు అందించి రిజిస్టర్​ అవ్వండి.
  • దరఖాస్తు ఫారాన్ని నింపిండి. కావాల్సిన ధ్రువపత్రాలను అప్​లోడ్​ చేయండి.
  • అప్లికేషన్​ ఫీజును చెల్లించండి. సబ్మిట్​ బటన్​ నొక్కే ముందు దరఖాస్తు ఫారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్​ చేయండి.
  • ముందు జాగ్రత్త కోసం దరఖాస్తు ఫారాన్ని జిరాక్స్​ తీయించి పెట్టుకోండి.

పదో తరగతి అర్హతతో 26,146 SSC జాబ్స్​- అప్లైకు 3 రోజులే ఛాన్స్​!

ఇంటర్​ అర్హతతో త్రివిధ దళాల్లో 400 ఉద్యోగాలు ​- దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్!​

ABOUT THE AUTHOR

...view details