పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ ముమ్మరంగా సాగిస్తోంది. అంబానీ ఇంటి సమీపంలో పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తి సంచరించడానికి సంబంధించిన సీసీటీవీ వీడియోపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
వాజేకు పీపీఈ కిట్ వేసి ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్! - sachin waze news
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో పీపీఈ కిట్ ధరించి, సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వ్యక్తి.. సచిన్ వాజేనే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర సాక్షుల మధ్య సీన్ రీక్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
సీసీటీవీలో వాజే?- ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్
అందులో ఉన్నది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేనే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో సీన్ రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాజేను పీపీఈ కిట్ ధరింపజేసి ఐదుగురు స్వతంత్ర సాక్షుల మధ్య సీన్ రీక్రియేట్ చేసేందుకు సిద్ధమైంది.
ఇదీ చదవండి:ఉద్యోగాలే ప్రధానాంశంగా కాంగ్రెస్ మేనిఫెస్టో