తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో పౌరుల హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు

జమ్ముకశ్మీర్​లో స్థానికేతరుల హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు చేపట్టనుంది(jammu kashmir news). హోంశాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే రంగంలోకి దిగనుంది.

nia
ఎన్​ఐఏ

By

Published : Oct 19, 2021, 2:22 PM IST

జమ్ముకశ్మీర్​లో(kashmir latest news) పౌరుల వరుస హత్యలపై ఎన్​ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణ చేపట్టనుంది. జమ్ముకశ్మీర్​ డీజీపీ​.. దర్యాప్తును ఎన్​ఐఏకు అప్పగించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ పంపుతున్నట్లు సమాచారం. హోంశాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఎన్​ఐఏ రంగంలోకి దిగనుంది.

ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన మఖన్​లాల్​ బింద్రో, విరేంద్ర పాశ్వాన్​కు సంబంధించిన కేసులపై ఎన్​ఐఏ దర్యాప్తు చేస్తుంది. అక్టోబర్​ 5న.. తన ఫార్మసీ దుకాణంలో మఖన్​లాల్​ పనిచేస్తుండగా.. ముష్కరులు పాయింగ్​ బ్లాంక్​లో కాల్చిచంపారు. భేల్​పూరి అమ్ముకునే విరేంద్రను కూడా పాయింట్​ బ్లాంక్​లో కాల్చి హత్య చేశారు(kashmir terror news).

జమ్ముకశ్మీర్​ పోలీస్​, ఎన్​ఐఏ డైరక్టర్​ జనరల్స్​.. శ్రీనగర్​లో సమావేశమై కేసుపై చర్చించనున్నట్టు సమాచారం.

పూంచ్​లో నరవణె..

మరోవైపు.. ఆర్మీ చీఫ్​ జనరల్​ నరవణె.. పూంచ్​లోని ఆపరేషన్​ సైట్లను సందర్శించారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు. చోరబాట్లకు వ్యతిరేకంగా సాగుతున్న కార్యకలాపాలను నరవణెకు అధికారులు వివరించారు.

అటు పౌరుల హత్యలు, భద్రతా దళాలు-ముష్కరుల ఎన్​కౌంటర్లతో గత కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల దాడుల్లో 11మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నాయి.

పూంచ్​లో నరవణె

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details