అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో విచారణ ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). తమ కస్టడీలో ఉన్న మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేతో ఘటనాస్థలి వద్ద శుక్రవారం రాత్రి సీన్ రీక్రియేట్ చేసింది. సీసీటీవీ ఫూటేజీలో దృశ్యాల మాదిరిగానే వాజేకు తెల్లకుర్తా వేసి ఆ మార్గంలో కొంతసేపు నడిపించారు. దాదాపు 30 నిమిషాలపాటు అక్కడ ఉన్న ఎన్ఐఏ, పోలీసు అధికారులు ఈ మొత్తం దృశ్యాన్ని రికార్డ్ చేశారు.
వాజేకు తెల్లకుర్తా వేసి ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్ - సీన్ రీక్రియేషన్
ముంబయి మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే చేత ఎన్ఐఏ సీన్ రీక్రియేట్ చేసింది. అంబానీ నివాసం వద్ద సీసీటీవీలో కనిపించిన వ్యక్తి సచిన్ వాజే అని ఏన్ఐఏ అనుమానిస్తోంది.
సీన్ రీక్రియేట్ చేసిన ఎన్ఐఏ
ఫిబ్రవరి 25న అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలు ఉన్న కారు గుర్తించారు. ఘటనాస్థలిలో ఓ వ్యక్తి పీపీఈ కిట్ ధరించి నడిచి వెళ్లడం సీసీటీవీ దృశ్యాల్లో లభ్యమైంది. ఆ వ్యక్తి సచిన్ వాజేనే అని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్ హిరెన్ మృతి, అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలకు సంబంధించి అనుమానిస్తూ వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
ఇదీ చదవండి :'శివసేన సర్కార్ను అవమానించేందుకే.. వాజే అరెస్టు'