తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ ఎమ్మెల్యే బంధువు అరెస్ట్​- ఐసిస్​తో లింకులే కారణం!

NIA raid ISIS: కర్ణాటకకు చెందిన మాజీ ఎమ్మెల్యే దివంగత బీఎం ఇదినబ్బా కుటుంబీకులను అరెస్ట్​ చేశారు ఎన్​ఐఏ అధికారులు. ఆయన కుమారుడు బీఎం బాషా కోడలైన నిందితురాలికి ఐసిస్​తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

nia arrest
మాజీ ఎమ్మెల్యే బంధువు అరెస్ట్​

By

Published : Jan 3, 2022, 7:21 PM IST

NIA raid ISIS: కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీఎం బాషా నివాసంపై ఎన్​ఐఏ సోమవారం దాడులు చేపట్టింది. అతని కోడలైన దీప్తి మర్లా అలియాస్​ మరియమ్​ను అధికారులు అరెస్ట్​ చేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్​తో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

నిందితురాలు మరియం అలియాస్​ దీప్తి మర్ల

మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఎం ఇదినబ్బా కుమారుడైన బీఎం బాషా నివాసంపై ఎన్​ఐఏ ఇదివరకు కూడా దాడులు చేపట్టింది. బీఎం బాషా కుటుంబానికి ఐసిస్​తో సంబంధం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు గతేడాది ఆగస్టులో రైడ్లు నిర్వహించింది. ఈ క్రమంలో అతని కుమారుడు అమర్​ అబ్దుల్​ రెహ్మాన్​ను అరెస్ట్​ చేసింది. ఆ సమయంలో మరియంను కూడా అనుమానించినా ఎన్​ఐఏ అరెస్ట్​ చేయలేదు.

కానీ అప్పటి నుంచి ఆమె కదలికలను గమనిస్తున్న ఎన్​ఐఏ.. ఐసిస్​ సహా జమ్ముకశ్మీర్​ మిలిటెంట్లతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం అందడం వల్ల సోమవారం అమెను అరెస్ట్​ చేసింది. ఐసిస్​ కోసం యువతను చేర్చుకునే రాకెట్​లో మరియం పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి :'81% కేసులు ఒమిక్రాన్​వే'.. సాధారణ జ్వరంలాంటిదేనన్న సీఎం!

ABOUT THE AUTHOR

...view details