తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NIA On Gurpatwant Singh : 'భారత్‌ను విభజించేందుకు ఉగ్ర కుట్రలు'.. NIA దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి.. - గురుపత్వంత్​ లేటెస్ట్ న్యూస్

NIA On Gurpatwant Singh : భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని ఖలిస్థాన్‌ ఉగ్రవాది కోరుకుంటున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.కెనడాలో ఉంటున్న హిందువులు భారత్‌కు వెళ్లిపోవాలంటూ హెచ్చరించిన ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ... భారత్‌ను విభజించాలని కోరుకుంటున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

gurpatwant singh pannun
gurpatwant singh pannun

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 10:59 PM IST

NIA On Gurpatwant Singh : నిషేధిత వేర్పాటువాద సంస్థ 'సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌' అధినేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని ఈ ఖలిస్థాన్‌ ఉగ్రవాది కోరుకుంటున్నట్లు NIA దర్యాప్తులో తేలినట్లు సమాచారం. కెనడాలో ఉంటున్న హిందువులు భారత్‌కు వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశాడు. అక్కడున్న హిందూ కెనడియన్లు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గట్టి చర్యలకు ఉపక్రమించిన భారత్... ఇక్కడున్న అతడి ఆస్తులను జప్తు చేసింది. అటువంటి ఉగ్రవాది భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని కోరుకుంటున్నట్లు NIA దర్యాప్తులో తేలినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారతదేశ ఐక్యత, సమగ్రతను సవాలు చేస్తూ పన్నూ ఆడియో మెసేజ్‌లు విడుదల చేసినట్లు వెల్లడైంది. దేశాన్ని మతపరంగా విభజించి ఓ వర్గానికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని అతను కోరుకుంటున్నట్లు దర్యాప్తులో తేలినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

NIA On Khalistan : పంజాబ్‌తోపాటు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూను.. NIA 2019లో మోస్ట్‌ వాంటెడ్‌గా ప్రకటించింది. ప్రత్యేక ఖలిస్థాన్‌ కోసం పోరాడటం, ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు NIA దర్యాప్తులో తేలింది. దీంతో అదే ఏడాది సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ను NIA నిషేధించింది. తర్వాత 2022లో పన్నూను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే అతడిపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఇంటర్‌పోల్‌ రెండుసార్లు తిరస్కరించింది. తాజాగా కెనడా-భారత్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కెనడాలోని హిందువులపై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు.

Gurpatwant Singh Pannun Property : కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న NIA... గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూకు పంజాబ్‌లో ఉన్న ఆస్తులను జప్తు చేసింది. పన్నూతోపాటు వివిధ దేశాల్లో నివసిస్తున్న మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాదులను గుర్తించి.. వారి ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా కార్డును రద్దు చేయాలని ఆయా విభాగాలకు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. తద్వారా వారు మళ్లీ భారత్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకోవచ్చనేది భారత్‌ అభిప్రాయంగా జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

Gurpatwant Singh Pannun Property : కెనడా హిందువులకు గుర్​పత్వంత్​ వార్నింగ్​.. ఆస్తులు జప్తు చేసి కేంద్రం షాక్​..

India Canada Row : 'కెనడాకు అమెరికా కీలక సమాచారం.. అందువల్లే భారత్​పై ట్రూడో ఆరోపణలు'

ABOUT THE AUTHOR

...view details