తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సచిన్​ వాజేకు ఏప్రిల్ 7వరకు రిమాండ్​ పొడిగింపు

పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్​ అసిస్టెంట్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్ సచిన్​ వాజేకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం ఏప్రిల్​ 7వరకు రిమాండ్​ పొడిగించింది.

సచిన్​ వాజేకు ఏప్రిల్ 7వరకు రిమాండ్
NIA custody of police officer Sachin Waze

By

Published : Apr 3, 2021, 6:01 PM IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో సస్పెండైన పోలీసు అధికారి సచిన్​ వాజేకు కస్టడీని ఏప్రిల్​ 7 వరకు ఎన్ఐఏ న్యాయస్థానం పొడిగించింది. ఇంతకు ముందు ఉన్న రిమాండ్ గడువు ముగియగా.. మరో ఆరు రోజులపాటు కస్టడీని పెంచాలని న్యాయస్థానాన్ని ఎన్​ఐఏ కోరింది.

కేసులో స్వాధీనం చేసుకున్న సీసీటీవీ వీడియో, ల్యాప్​టాప్​లను ఏజెన్సీ పరిశీలించాల్సి ఉందని ఎన్​ఐఏ తరుపు న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఏప్రిల్​ 7 వరకు కస్టడీని పెంచింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనాన్ని ఫిబ్రవరి 25న పోలీసులు కనుగొన్నారు. దాని యజమానిగా భావిస్తున్న హిరేన్‌ మన్‌సుఖ్‌ మృతి చెందారు.

ఇదీ చదవండి:సచిన్‌ వాజే అడ్డా.. రూమ్​ నంబరు 1964!

ABOUT THE AUTHOR

...view details