తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఐఏ సోదాలు.. ముగ్గురు అరెస్ట్​

దిల్లీ, కర్ణాటక, కేరళలోని 11 ప్రాంతాల్లో ఎన్​ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్​, ఐసిస్​ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని అరెస్ట్​ చేసింది.

NIA
జాతీయ దర్యాప్తు సంస్థ

By

Published : Mar 15, 2021, 7:30 PM IST

దేశంలో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్‌ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అప్రమత్తమైంది. సోమవారం దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. దిల్లీ, కర్ణాటక, కేరళలోని 11 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కుట్రకు సంబంధించి పాక్‌, ఐసిస్‌ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సమాచారం.

అరెస్టయిన వారిలో.. కేరళకు చెందిన మహమ్మద్​ అమీన్​ నేతృత్వంలోని బృందానాకి చెందిన వారు ఉన్నారని ఎన్​ఐఏ అధికారి తెలిపారు. అమీన్​తో పాటు అతని అనుచరుడు ముషాబ్​ అన్వర్​, డాక్టర్​ రహీస్​ రషీద్​లు ఉన్నట్లు చెప్పారు. వారి సామాజిక మాధ్యమాల వేదికగా యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఉగ్రవాద సంబంధాలపై ఇటీవల కొందరు మహిళలను ఐన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోగా.. వారిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టింది. సోషల్‌మీడియా వేదికల్లో స్థానిక యువతను ఆకర్షించి, వారికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందింది. వీరి ద్వారా దేశంలో పలు చోట్ల పేలుళ్లు జరిపేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​ కేసులో అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details