జమ్ము కశ్మీర్‌లో మైనారిటీలపై ఉగ్రదాడులకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA news) విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లోని 18 ప్రదేశాల్లో దాడులు (NIA raids in Kashmir) జరుపుతోంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్‌బదర్ సంస్థలపై దృష్టి సారించిన ఎన్ఐఏ... ఉగ్రవాదసంస్థలకు సంబంధమున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా గాలిస్తోంది. (NIA raids in J&K)
ఇది రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండో భారీ తనిఖీ ఆపరేషన్ కావడం గమనార్హం. అక్టోబర్ 10న దాదాపు 15 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది.
సీబీఐ సైతం..
మరోవైపు, కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ) సైతం కశ్మీర్‌లో దాడులు (CBI raid today) చేస్తోంది. మొత్తం 40 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టింది. జమ్ము కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహాదారుడిగా పనిచేసిన బసీర్ ఖాన్ అనే వ్యక్తి ఇంటిలో సైతం సోదాలు జరుపుతోంది. ఆయుధాల లైసెన్సింగ్ కేసులో భాగంగా ఈ దాడులు నిర్వహిస్తోంది సీబీఐ. (CBI raid news)
ముంద్రా కేసులో...