తెలంగాణ

telangana

సచిన్​ వాజేను అరెస్ట్ చేసిన ఎన్​ఐఏ

గత నెల 25న అంబానీ ఇంటి వద్ద బాంబులు లభ్యమైన కేసులో పోలీసు అధికారి సచిన్​ వాజేను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. ఈ విషయాన్ని ఎన్​ఐఏ ప్రతినిధి వెల్లడించారు.

By

Published : Mar 14, 2021, 4:48 AM IST

Published : Mar 14, 2021, 4:48 AM IST

sachin vaze
సచిన్​ వాజేను అరెస్ట్ చేసిన ఎన్​ఐఏ

అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో పోలీస్​ అధికారి సచిన్​ వాజేను జాతీయ భద్రతా సంస్థ (ఎన్​ఐఏ) శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఈ విషయాన్ని ఎన్​ఐఏ ప్రతినిధి తెలిపారు. 12 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత వాజేను అరెస్టు చేశామని స్పష్టం చేశారు. వాంగ్మూలం ఇచ్చేందుకు ముంబయిలోని ఎన్​ఐఏ కార్యాలయానికి వచ్చిన వాజేను ఉదయం 11.30 నుంచి సుదీర్ఘ కాలం పాటు ఎన్​ఐఏ విచారించింది. ఈ సందర్భంగా ముంబయి పోలీసుల వాంగ్మూలాన్ని కూడా ఎన్​ఐఏ నమోదు చేసింది.

గత నెల 25న ముకేశ్ అంబానీ ఇంటివద్ద జిలెటిన్​ ఉన్న స్కార్పియో కారును పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు ఎన్ఐఏ చేపడుతుండగా, ఆ కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్​ హిరేన్ కేసును వాజే ఆధ్వర్యంలో ముంబయి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే వాజేపై ఆరోపణలు రావడం వల్ల ఆయనను క్రైం బ్రాంచ్​ నుంచి బదిలీ చేశారు.

ఇదీ చదవండి :సచిన్​ వాజే వాట్సాప్​ స్టేటస్​ కలకలం

ABOUT THE AUTHOR

...view details