తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఐఏ కస్టడీకి వాజేకు సహకరించిన పోలీసు​! - సచిన్​ వాజే

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో పోలీసు అరెస్టయ్యారు. ఈ కేసులో సస్పెండైన సచిన్ వాజేకు సహకారం అందించినట్లుగా భావిస్తున్న రియాజ్​ కాజీ అనే అసిస్టెంట్ పోలీసు ఇన్స్​పెక్టర్​ను అరెస్టు చేశారు ఎన్​ఐఏ అధికారులు. అనంతరం ఆయన్ని ఈ నెల 16వరకు ఎన్​ఐఏ కస్టడీని విధించింది కోర్టు.

NIA arrests Mumbai cop Riyaz Kaji in Antilia bomb scare case
ఎన్​ఐఏ కస్టడీకి వాజేకు సహకరించిన పోలీసు​!

By

Published : Apr 11, 2021, 3:29 PM IST

Updated : Apr 11, 2021, 4:14 PM IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలకేసులో అసిస్టెంట్ పోలీసు ఇన్స్​పెక్టర్ రియాజ్​ కాజీకి ఈ నెలన్ 16 వరకు ఎ​ఐఏ కస్టడీని విధించింది జాతీయ దర్యాప్తు సంస్థ స్పెషల్​ హాలిడే కోర్టు. శనివారం రాత్రి.. ఖాజీని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆయన్ని ఆదివారం కోర్టు ముందు హాజరుపరిచారు.

ఈ కేసులో రియాజ్​ పాత్రను.. ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థ గుర్తించిన తర్వాత ఈ మేరకు చర్యలు తీసుకుంది ఎన్​ఐఏ. అతడితో పాటు మరికొందరి వద్ద వాంగ్మూలాలను తీసుకుంది.

అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాల కేసు సహా.. వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాజేను ఎన్‌ఐఏ.. మార్చి 13న అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సస్పెండెడ్ పోలీస్​ కానిస్టేబుల్ వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేశ్ గోర్​లకు కోర్టు ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది.

ఇదీ చూడండి:సచిన్‌ వాజేకు ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు

Last Updated : Apr 11, 2021, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details