NIA arrest terrorist: జమ్మూలో ఏప్రిల్‌లో జరిగిన పుల్వామా తరహా ఉగ్రదాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. నిందితుడి పేరు అబిద్ అహ్మద్ మీర్ అని అధికారులు తెలిపారు. పుల్వామాలోని పుత్రిగామ్లో నివసిస్తున్న ఇతడు.. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు అండర్‌గ్రౌండ్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే కేసులో అరెస్టైన బిలాల్ అహ్మద్ వాగేకు మీర్ సన్నిహితుడని తెలిపారు. పాకిస్థాన్‌లోని జైషే ఉగ్రవాదులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దాడి విషయంలో ఇతర నిందితులకు మీర్ సహకరించాడని ఎన్ఐఏ ప్రతినిధి వెల్లడించారు.
'పుల్వామా దాడి' నిందితుడు అరెస్ట్.. జైషే సంస్థతో కుట్ర! - జమ్ము ఉగ్రవాది అరెస్ట్
NIA arrest terrorist: ఇటీవల జమ్మూలో జరిగిన పుల్వామా తరహా ఉగ్రదాడికి సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ ముష్కరుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ దాడికి పాల్పడిన నిందితులతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పాక్‌లోని జైషే సంస్థతో మంతనాలు జరుపుతున్నాడని చెప్పారు.
NIA arrests key accused in Sunjwan terror attack case
ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటనకు రెండ్రోజుల ముందు సీఐఎస్ఎఫ్ వాహనంపై సంజ్వాన్‌లో దాడి చేశారు ఉగ్రవాదులు. బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు.
ఇదీ చదవండి:బన్‌లో క్రీమ్ లేదని.. బేకరీ యజమానిపై కస్టమర్ల దాడి!