తెలంగాణ

telangana

'లష్కరే' ముఠాకు రహస్య పత్రాలు- ఐపీఎస్ అధికారి అరెస్ట్​

NIA arrests IPS officer: లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ మాజీ ఎస్‌పీ, ఐపీఎస్​ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగీని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. లష్కరే తోయిబా కార్యకలాపాల విస్తరణ వ్యవహారంలో నమోదైన కేసు విచారణలో భాగంగా నేగీని అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.

By

Published : Feb 18, 2022, 8:54 PM IST

Published : Feb 18, 2022, 8:54 PM IST

NIA arrests IPS officer
NIA arrests IPS officer

NIA arrests IPS officer: రహస్య పత్రాల లీకేజీ వ్యవహారంలో ఐపీఎస్ అధికారిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు రహస్య పత్రాలు లీక్​ చేశారనే ఆరోపణతో ఐపీఎస్​ అధికారి అరవింద్​ దిగ్విజయ్​ నేగీని అదుపులోకి తీసుకుంది. గతంలో నేగీ ఎన్​ఐఏలో పని చేసినట్లు అధికారులు తెలిపారు. లష్కరే తోయిబా కార్యకలాపాల విస్తరణ వ్యవహారంలో నమోదైన కేసు విచారణలో భాగంగా నేగీని అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.

లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన ఓజీడబ్ల్యూగా ఉన్న మరో నిందితుడికి ఏడీ నేగి ఎన్‌ఐఏ అధికారిక రహస్య పత్రాలను లీక్ చేశారని గుర్తించినట్లు వెల్లడించింది.

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళికల అమలు కోసం లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ విస్తృత నెట్‌వర్క్ వ్యాప్తికి సంబంధించి దర్యాప్తు చేస్తోంది ఎన్​ఐఏ. గతంలో ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది. తాజాగా రహస్య పత్రాల లీకేజీలో నేగీ పాత్ర ఉన్నట్లు తేలగా.. అతని ఇళ్లలో ఎన్​ఐఏ సోదాలు జరిపింది.

నేగీ ప్రస్తుతం సిమ్లా ఎస్​పీగా ఉన్నారు.

ఇదీ చూడండి:హిజాబ్​ ఇష్యూలో విద్యార్థులపై తొలికేసు- లెక్చరర్​ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details