తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగాల్​ హింస' నివేదికపై మమత గుస్సా - బంగాల్​ హింసపై మమత

ఎన్నికల అనంతరం బంగాల్​లో జరిగిన హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసిన ఎన్​హెచ్​ఆర్​సీ.. తమ నివేదికను బహిర్గతం చేయడాన్ని సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. రాజకీయ కుట్రగా దీన్ని అభివర్ణించారు.

mamata, bengal cm
మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

By

Published : Jul 15, 2021, 6:20 PM IST

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్​హెచ్​ఆర్​సీ).. తమ నివేదికను బహిర్గతం చేయడంపై​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు ఇవ్వాల్సిన లేఖను మీడియాకు లీక్​ చేయడమేంటని ప్రశ్నించారు. ఎన్​హెచ్​ఆర్​సీ కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని ఆరోపించారు. భాజపా చేసిన రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే నివేదిక లీకైందని మమత అన్నారు.

"బంగాల్​ పేరు చెడగొట్టేందుకు, రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకు నిష్పక్షపాత సంస్థలను కూడా భాజపా ఉపయోగించుకుంటోంది. ఎన్​హెచ్​ఆర్​సీ.. కోర్టు అధికారాలను గౌరవించి ఉంటే బాగుండేది. మీడియాకు లీక్​ చేయడానికి బదులు నివేదికను కోర్టుకు సమర్పించాల్సింది."

--మమతా బెనర్జీ, బంగాల్ సీఎం.

బంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన హత్య​, అత్యాచారం ఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోల్​కతా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్​హెచ్​ఆర్​సీ ప్రతిపాదించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమత.. యూపీలో జరిగిన ఘటనలపై ఎన్ని కమిటీలు వేశారని ప్రశ్నించారు.

బంగాల్​కు నిధులు, వ్యాక్సిన్లు ఇవ్వకపోవడం అన్యాయమని మమత అరోపించారు. 14 కోట్ల టీకాలు అవసరమైతే 2 కోట్ల డోసులే పంపారని కేంద్రంపై ధ్వజమెత్తారు. టీకాల విషయంలోనూ వివక్ష చూపడం సరికాదని అన్నారు.

దిల్లీ పర్యటన

వచ్చే వారం దిల్లీ పర్యటిస్తానన్న మమత.. అవకాశమొస్తే ప్రధాని మోదీని, రాష్ట్రపతిని కలుస్తానని తెలిపారు. ఎప్పటిలాగే ఎన్నికల అనంతరం.. కొందరు మిత్రులను కలిసేందుకు తప్పనిసరిగా దిల్లీ వెళ్తానని చెప్పారు. కొవిడ్​ పరిస్థితులు అదుపులో ఉన్న కారణంగా కొన్ని రోజులు దిల్లీలోనే ఉంటానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'బంగాల్​లో హింసపై నివేదిక పంపరేం?'

దీదీ సర్కార్​కు హైకోర్టు షాక్- 'అధ్యయనం కొనసాగించాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details