తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NHPC recruitment 2023 : 388 ఇంజినీర్​ పోస్టులకు నోటిఫికేషన్​.. అప్లై చేసుకోండిలా! - nhpc je application dates

NHPC recruitment 2023 : ప్రభుత్వ రంగ సంస్థ 'ఎన్​హెచ్​పీసీ లిమిటెడ్'​..388 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా జేఈ, సూపర్​వైజర్​, అకౌంటెంట్​ సహా వివిధ కేటగిరీలకు చెందిన ఖాళీలు భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు మీ కోసం..

NHPC recruitment 2023
NHPC JE recruitment 2023

By

Published : Jun 16, 2023, 10:53 AM IST

NHPC Recruitment 2023 : జలవిద్యుత్ ఉత్పత్తి రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థ, 'మినీ రత్న'.. ఎన్​హెచ్​పీసీ లిమిటెడ్​ 388 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా జూనియర్​ ఇంజినీర్​ (జేఈ), సూపర్​వైజర్​, అకౌంటెంట్​ సహా వివిధ కేటగిరీలకు చెందిన పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

  • జూనియర్​ ఇంజినీర్​ (సివిల్​) - 149 పోస్టులు
  • జూనియర్​ ఇంజినీర్ (ఎలక్ట్రికల్​) - 74 పోస్టులు
  • జూనియర్​ ఇంజినీర్​ (మెకానికల్​) - 63 పోస్టులు
  • జూనియర్​ ఇంజినీర్ (ఈ&సీ) ఎస్ 1 - 10 పోస్టులు
  • సూపర్​ వైజర్​ (ఐటీ) ఎస్​ 1 - 9 పోస్టులు
  • సూపర్​ వైజర్​ (ఐటీ) ఎస్​ 1 - 19 పోస్టులు
  • సీనియర్ అకౌంటెంట్ ఎస్​ 1 - 28 పోస్టులు
  • హిందీ ట్రాన్స్​లేటర్​ - 14 పోస్టులు
  • డ్రాఫ్ట్​మెన్ (సివిల్​) - 14 పోస్టులు
  • డ్రాఫ్ట్​మెన్​ (ఎలక్ట్రికల్​, మెకానికల్​) - 8 పోస్టులు

వయోపరిమితి :
అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. అయితే రిజర్వేషన్లు ప్రకారం, వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.

విద్యార్హత
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి ఆయా కేటగిరీలకు చెందిన జూనియర్ ఇంజినీర్​ పోస్టులకు సంబంధించిన ఫుల్​టైమ్​ డిప్లొమా లేదా ఐటీఐ చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పోస్టులకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం
ఎన్​హెచ్​పీసీ జేఈ పరీక్ష పత్రంలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇవి ఆబ్జెక్టివ్​ లేదా మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నల తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు 1 మార్కు వస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్ మార్క్​ ఉంటుంది. మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలు.
పరీక్ష పత్రంలో 3 భాగాలు ఉంటాయి. పార్ట్ 1లో సంబంధిత ఉద్యోగ కేటగిరీకి చెందిన సబ్జెక్ట్​పై 140 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్​ 2లో జనరల్​ అవేర్​నెస్​ ప్రశ్నలు 30 ఉంటాయి. పార్ట్ 3లో రీజనింగ్​ ఎబిలిటీ ప్రశ్నలు 30 ఉంటాయి. మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి.

అప్లికేషన్​ ఫీజు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​ సర్వీస్​మెన్​ కేటగిరీల అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగతా కేటగిరీల అభ్యర్థులు జీఎస్టీతో సహా రూ.295 అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ
దరఖాస్తు ప్రక్రియ జూన్​ 9 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్​ 30. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

పరీక్ష తేదీ వివరాలు
ప్రస్తుతానికి అడ్మిట్​ కార్డ్​ డౌన్​లోడ్​, పరీక్ష తేదీ వివరాలు వెల్లడించలేదు. అప్​డేట్స్​ కోసం అభ్యర్థులు ఎన్​హెచ్​పీసీ అధికారిక వెబ్​సైట్​ https://www.nhpcindia.com/ ను చూడాలి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details