పవర్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు.. ఐటీఐ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే.. - nhpc iti apprentice jobs notification 2023
2023 సంవత్సరానికి గాను నోటిఫికేషన్‌ను విడుదల చేసింది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాలు మీకోసం.
నిరుద్యోగ యువతకు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ఎచ్పీసీ) శుభవార్త చెప్పింది. నైపుణ్యం, అర్హత ఉన్న ఆసక్తిగల అభ్యర్థుల కోసం అప్రెంటిస్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 19 ఖాళీలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయగా.. ఆన్లైన్ అప్లికేషన్లు ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమవుతాయి. ఇది వివిధ విభాగాలలో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆ వివరాలు మీకోసం..
ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి?
కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
ప్లంబర్
ఎలక్ట్రీషియన్
శిక్షణ.. ఎన్ఎచ్పీసీ రిక్రూట్‌మెంట్ ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందుతారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవాలి. అలాగే కింద పేర్కొన్న చిరునామాకు అప్లికేషన్ హార్డ్ కాపీని పంపాలి. దరఖాస్తు ఫారాన్ని నోటిఫికేషన్లో అందుబాటులో ఉంచారు. నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 28న ముగుస్తుంది. ఎన్ఎచ్పీసీ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ప్రకారం ఐటీఐ అప్రెంటిస్‌షిప్ పోస్ట్ కోసం 19 ఖాళీలు ఉన్నాయి.
అంశం
నోటిఫికేషన్ వివరాలు
రిక్రూట్‌మెంట్
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేన్ ఐటీఐ అప్రెంటిస్‌షిప్ పోస్టులకు
ఖాళీలు
19
అర్హత
10th +ఐటిఐ(ITI) ఉత్తీర్ణులై ఉండాలి (ఫలితం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేయకూడదు). ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఐటిఐ సంబంధిత శిక్షణ పొంది ఉండాలి.
వయోపరిమితి
కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు.
పదవీకాలం
ఎంపికైన అభ్యర్థులు 1 సంవత్సరం పాటు శిక్షణ పొందుతారు
జీతం
అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం జీతాలు పొందుతారు
ఎంపిక ప్రక్రియ
ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
అప్లికేషన్ ప్రారంభం
2023, ఫిబ్రవరి 8
అప్లికేషన్ చివరి తేది
2023, ఫిబ్రవరి 28
వెబ్సైట్
www.apprenticeshipindia.org
దరఖాస్తు విధానం ఎన్ఎచ్పీసీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాల స్వీయ-ధృవీకరణ కాపీని దిగువ పేర్కొన్న చిరునామాకు చివరి తేదీలోపు లేదా అంతకుముందే పంపాలి. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు.
దరఖాస్తు పంపడానికి చిరునామా -జనరల్ మేనేజర్ (HR) ఎన్ఎచ్పీసీ ప్రాంతీయ కార్యాలయం, బనిఖేత్ VPO.బనిఖేత్, టెహ్. డల్హౌసీ జిల్లా.చంబ, హిమాచల్ ప్రదేశ్, పిన్ కోడ్- 176303 పూర్తి వివరాలకై అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.