తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజద్రోహం సెక్షన్​పై మరో దావా

రాజద్రోహం కేసులు నమోదు చేసే సెక్షన్​ '124ఏ' రాజ్యాంగం ప్రకారం చెల్లదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పీపుల్స్​ యూనియన్​ ఫర్​ సివిల్ లిబర్టీస్​(పీయూసీఎల్​) మరో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ సెక్షన్​ స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య సమాజానికి సరిపడదని పేర్కొంది.

petition on sedition in sc
సుప్రీంకోర్టు

By

Published : Jul 17, 2021, 7:04 AM IST

రాజద్రోహం కేసులు నమోదు చేసే సెక్షన్​ '124ఏ' రాజ్యాంగం ప్రకారం చెల్లదని పేర్కొంటూ శుక్రవారం సుప్రీంకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. పీపుల్స్​ యూనియన్​ ఫర్​ సివిల్ లిబర్టీస్​(పీయూసీఎల్​).. ఈ సెక్షన్​ అరాచకమైనదని, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య సమాజానికి సరిపడదని పేర్కొంది. ఇప్పటికే ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది.

మహాత్మాగాంధీ వంటి స్వాతంత్ర్యోద్యమకారులపై ప్రయోగించిన బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. దేశద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది. అనేక వలస చట్టాలను, ఉపయోగంలో లేని వాటిని రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించింది. రాజద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలించనున్నట్లు తెలిపిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details