తెలంగాణ

telangana

Pawan Announced TDP Janasena Alliance : వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 1:16 PM IST

Updated : Sep 14, 2023, 9:50 PM IST

Pawan_Breaking
Pawan_Breaking

13:14 September 14

Pawan Breaking నేను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గను: పవన్‌ కల్యాణ్‌

Pawan Announced TDP Janasena Alliance : వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Announced TDP Janasena Alliance : అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వెల్లడించారు. ఇవాళ్టి ములాఖత్‌ ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైందని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్‌ స్పష్టం చేశారు. వైసీపీని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందన్న పవన్.. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. బాలకృష్ణ, లోకేశ్ తో కలిసి రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో పవన్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకొచ్చిన ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు.

Pawan Kalyan, Lokesh, Balakrishna Meet in Rajamahendravaram: నేడు పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ బాలకృష్ణల భేటీ.. చంద్రబాబుతో ములాఖత్​

చంద్రబాబు రాజకీయవేత్త... జగన్‌ ఆర్థిక నేరస్థుడు అన్న పవన్‌.. సైబరాబాద్‌ (Cyberabad) నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే తన ఆకాంక్ష అని తెలిపారు. హైటెక్‌ సిటీ సృష్టించిన విజనరీకి ఈ దుస్థితి ఏమిటి..? ఏపీ దుస్థితిపై ప్రధాని మోదీ, అమిత్‌ షా, గవర్నర్‌కు తెలియజేస్తాం అని చెప్పారు. చంద్రబాబు భద్రత విషయం, ప్రధాని మోదీ, అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని పవన్‌ వెల్లడించారు. వైసీపీ నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని పవన్ కల్యాణ్ తెలిపారు.

అధికారులు జగన్‌ను నమ్ముకుంటే.. కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్లేనని.. డీజీపీ, సీఎస్‌ సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగదోడే అవకాశం ఉంటుందని చెప్పారు. చట్టాలను అధిగమించి చేసే అధికారులు ఆలోచించుకోవాలన్న పవన్.. పోలీసు వ్యవస్థ (police system) ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరు అని విచారం వ్యక్తం చేశారు. మీకు సమయం ఆరు నెలలు మాత్రమే ఉంది.. యుద్ధమే కావాలంటే సిద్ధమే అని పవన్ వైసీపీ నేతలను హెచ్చరించారు. తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు 6 నెలలు సమయముంది.. వైసీపీ నాయకులంతా ఆలోచించుకోవాలి... ఎవరినీ వదిలిపెట్టం అని పవన్ స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక, మైనింగ్‌, బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టం అని హెచ్చరించారు.

Pawan Kalyan Will Meet Chandrababu in Rajamahendravaram Jail Tomorrow: రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్

నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని, అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని పవన్‌కల్యాణ్‌ అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చానని, సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడానని చెప్పారు. తన నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయన్న పవన్.. అవన్నీ ఏపీ భవిష్యత్ కోసమే అని స్పష్టం చేశారు. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతో మోదీకి మద్దతు తెలిపానని.. దక్షిణాది నుంచి మోదీకి మద్దతు (Support Modi) తెలిపిన వ్యక్తి నేను అని చెప్తూ... ఆ సమయంలో నన్ను అందరూ తిట్టారని గుర్తు చేసుకున్నారు.

తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గను అని పవన్ స్పష్టం చేశారు. ఏ రోజైనా సరే.. మోదీ పిలిస్తేనే వెళ్లాను.. ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయను అని చెప్పారు. 2014లో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చేందుకు కూడా ముఖ్యకారణం ఉందన్న పవన్.. విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నానని వెల్లడించారు. చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. చంద్రబాబు అనుభవం, సమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉంది అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు.

Pawan Says his support to Chandrababu Naidu will Continue: చంద్రబాబుకు నా మద్దతు కొనసాగుతుంది: పవన్‌ కల్యాణ్‌

Last Updated : Sep 14, 2023, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details