అన్యాయం ఎక్కడున్నా దాంతో సర్వత్రా న్యాయానికి ముప్పు తప్పదని.. ఒక అంశం ప్రత్యక్షంగా ఒకరిపై ప్రభావం చూపితే పరోక్షంగా అందరిపైనా చూపుతుంది అన్న మార్టిన్ లూథర్‌కింగ్ వ్యాఖ్యలను అందరూ గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి నామినేట్ అయిన జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. గోవాలో నూతనంగా రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించిన బాంబే హైకోర్టు నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొని కీలక ప్రసంగం చేసిన ఆయన.. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు తమకు అవసరమైనప్పుడు న్యాయం కోసం కోర్టుల తలుపులు తట్టే పరిస్థితులు వచ్చినప్పుడే న్యాయవ్యవస్థ అందరికీ చేరువైనట్లుగా భావించాలని అభిప్రాయపడ్డారు.
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరును ప్రతిపాదించిన తర్వాత పాల్గొన్న తొలి కార్యక్రమంలో మాట్లాడిన జస్టిస్ రమణ భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాల్సిన తీరు, భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరు గురించి కీలక ప్రసంగం చేశారు. దేశంలో న్యాయవ్యవస్థను ఆధునీకరించేందుకు జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:'వారికి ఉచితంగా న్యాయసేవలు అందించండి!'
ఇదీ చదవండి:భార్యలను తీసుకెళ్లని ఎన్ఆర్ఐ భర్తలపై వ్యాజ్యం
న్యాయం అందుబాటులోకి రావాలంటే రోజురోజుకీ పెరుగుతున్న కేసులకు తగ్గట్టు మౌలికవసతులు పెరగాల్సిన అవసరం ఉందని.. అన్ని జిల్లాల్లో కోర్టులున్నప్పటికీ ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా వాటిని ఆధునీకరించాల్సి ఉందన్నారు జస్టిస్ రమణ. న్యాయవ్యవస్థలో దాగివున్న సూక్ష్మ అంశాలను పరిగణలోకి తీసుకొని భారతీయ న్యాయవ్యవస్థ మౌలికవసతుల ఆధునీకరణకు అనువైన, సుస్థిరమైన, సమ్మిళితమైన నమూనాలను మేధావులు, నిపుణులు సూచించాలని కోరారు.
ఇదీ చదవండి:'న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి'
ఇదీ చదవండి:అవసరాలే ఆవిష్కరణలకు ఆలంబన: జస్టిస్ రమణ
మౌలిక వసతుల కల్పన..